Covid Limit Spread : దూరం, వెంటిలేషన్, మాస్క్‌తోనే కరోనా కట్టడి సాధ్యం..!

కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. సామాజిక దూరం, సరైన వెంటిలేషన్, మాస్క్‌లు తప్పక పాటించాల్సిన అవసరం ఉంది. ఒకే గదిలో గాలి ద్వారా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Covid Limit Spread : ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. సామాజిక దూరం, సరైన వెంటిలేషన్, మాస్క్‌లు తప్పక పాటించాల్సిన అవసరం ఉంది. ఒకే గదిలో గాలి ద్వారా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొంతమందిలో రోగలక్షణాలు బహిర్గతం వ్యవధి ఒక్కోలా ఉంటోందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కొత్త అధ్యయనం చెబుతోంది.

ఈ అధ్యయనాన్ని ఇంకా సమీక్షించాల్సిన అవసరం ఉంది. అందుకే సాధ్యమైనంత వరకు వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని, సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తప్పక పాటించాలని అధ్యయనం సూచిస్తోంది. SARS-CoV వ్యాప్తిని నిర్ధారించేందుకు హైదరాబాద్ మొహాలిలోని ఆస్పత్రులు, వివిధ కోవిడ్, నాన్-కోవిడ్ ఆస్పత్రుల నుంచి కొవిడ్-19 ఇండోర్ నుంచి ఎయిర్ శాంపిల్స్ సేకరించారు. న్యూట్రల్ పర్యావరణ పరిస్థితులలో వైరస్ గాలిలో ఎక్కువ ప్రయాణించదని అధ్యయన ఫలితాలు వెల్లడించాయి.

కొవిడ్-పాజిటివ్ వ్యక్తులు గదిలో 20 నిమిషాల కొద్ది సమయం గడిపినప్పుడు ఈ వైరస్ నాలుగు అడుగుల దూరంలో ఉన్నా సోకదని తెలిపింది. అలాగే 8 అడుగుల 12 అడుగుల వద్ద సేకరించిన శాంపిల్స్ కూడా నెగటీవ్ అని తేలింది. తేలికపాటి లక్షణాలు కలిగిన ముగ్గురు వ్యక్తులు కనీసం ఒక గంట ఒకే గదిలో ఉన్న తర్వాత వెంటనే అదే స్థలంలో వైరస్ గుర్తించవచ్చు. కొవిడ్ -19 మార్గదర్శకాలను పాటించక పోవడమే మహమ్మారి వ్యాప్తికి కారణమని అధ్యయనం తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు