Do children and older people get respiratory problems if they take the pneumococcal vaccine?
Respiratory Problems : శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న చిన్నారుల ఊపిరితిత్తుల్లో వాపు రావడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడం, తినడానికి, తాగడానికి కష్ట్టంగా మారి అపస్మారక స్థితిలోకి చేరి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. న్యూమోకోకల్ అనే బ్యాక్టీరియా నుంచి న్యూమోనియా వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువగా న్యుమోనియాతో బాధపడుతుంటారు. చిన్నారులు శ్వాస ఆడక విలవిల్లాడుతుంటారు. వారికి సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాల మీదకు వస్తుంది.
ప్రస్తుత తరుణంలో పిల్లలకు తప్పనిసరిగా న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో అంటు వ్యాధులు సోకకుండా ఇది అడ్డుకుంటుంది. న్యుమోనియా మెనింజిటిస్ వంటి వ్యాధుల వ్యాప్తిని కట్టడి చేస్తుంది. ఈ వ్యాక్సిన్‌తో న్యూమోనియా, సెఫ్టిసేమియా, ఐర్థెంటిస్, సైనోసైటిస్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
చిన్నారులే కాకుండా 65 ఏళ్లు దాటిన వాళ్లు ఎవరైనా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మూత్రపిండాలు, గుండె, కాలేయం, సిఒపిడి, ధూమపానం, మధుమేహం, ఎముక మజ్జ లేదా ఇతర అవయవ మార్పిడిలు చేసి ఉంటే తప్ప 65 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవటం మేలు.
చలికాలంలో ఎటువంటి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా ఉండాలనుకుంటే వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఈ వ్యాక్సిన్‌ను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకపోయినా 65 ఏళ్లు పైబడిన వాళ్లు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే న్యూమోకోకల్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.
శిశువు పుట్టిన సమయం నుంచి 6 వారాలు, 14 వారాల సమయంలో పీసీవీ టీకాలు ఇచ్చి, 9 నెలల శిశువుకు బూస్టర్ టీకాను వేయించుకోవాలి. శిశువు పుట్టిన ఏడాదిలోగా తప్పనిసరి టీకా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి డోస్‌లోనూ 0.5 మి.లీ. మోతాదు వ్యాక్సిన్ ఇస్తారు. పుట్టిన మొదటి సంవత్సరంలోనే వ్యాక్సిన్ ఇవ్వటం ఆలస్యమైతే కనిష్టంగా 8 వారాల వ్యవధిలో తదుపరి డోసు ఇవ్వాలి.