Cabbage
Cabbage : క్యాబేజీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల క్యాబేజీ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఎరుపు, పర్పుల్, వైట్, గ్రీన్.. ఇలా భిన్న రకాల రంగుల్లో మనకు క్యాబేజీ లభిస్తుంది. మనకు గ్రీన్ కలర్ క్యాబేజీ ఎక్కువగా లభిస్తుంది. అయితే ఏ రంగు క్యాబేజీ అయినా సరే.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలనే అందిస్తుంది.
మనకు చాలా చవక ధరలకు అందుబాటులో ఉండే కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. క్యాబేజీలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ఫోలేట్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు ఎ, సి, కె లు అధికంగా ఉంటాయి. క్యాబేజీల్లొ ఫైటో న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. దీంతో క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.
క్యాబేజీల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు అధికంగా ఉంటాయి. ఒక కప్పు అంటే 89 గ్రాముల పచ్చి క్యాబేజీని తినడం వల్ల 22 క్యాలరీలు లభిస్తాయి. ప్రోటీన్లు 1 గ్రాము, ఫైబర్ 2 గ్రాములు, విటమిన్ కె 85 శాతం , విటమిన్ సి 54 శాతం, ఫోలేట్ 10 శాతం, మాంగనీస్ 7 శాతం, విటమిన్ బి6 6 శాతం, కాల్షియం 4 శాతం, పొటాషియం 4 శాతం, మెగ్నిషియం 3 శాతం లభిస్తాయి. దీంతోపాటు చిన్న మొత్తాల్లో విటమిన్ ఎ, ఐరన్, రైబో ఫ్లేవిన్ తదితర పోషకాలు కూడా అందుతాయి.
క్యాబేజీలోనూ విటమిన్ సి ఎక్కువగానే ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కొల్లాజెన్ వల్ల మన శరీరంలో ఎముకలు, కండరాలు, రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే చర్మం సంరక్షించబడుతుంది. క్యాబేజీలో ఉండే సల్ఫోరఫేన్, కాయెంప్‌ఫెరాల్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల క్యాబేజీని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఎరుపు రంగు క్యాబేజీలో ఆంథో సయనిన్లు అనబడే శక్తివంతమైన సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అందువల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. క్యాబేజీలో పొటాషియం సమృద్దిగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. రక్త నాళాలను ప్రశాంత పరుస్తుంది.
అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం క్యాబేజీని తినకూడదు. తింటే సమస్యలు మరింత ఎక్కువవుతాయి. క్యాబేజీలో అధిక భాగం రిఫినోస్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సరిగ్గా జీర్ణం కాదు. అందువల్ల గ్యాస్, అజీర్ణం సమస్యలు ఉన్నవారు క్యాబేజీని తింటే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితిలోనూ క్యాబేజీని తినరాదు.
రక్తాన్ని పలుచన చేసే మందులను వాడేవారు క్యాబేజీని తినరాదు. క్యాబేజీలో అధిక మొత్తంలో విటమిన్ కె ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం గడ్డ కట్టేందుకు ఉపయోగపడుతుంది. కనుక రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడేవారు క్యాబేజీని ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోరాదు. హైపో థైరాయిడిజం వ్యాధితో బాధపడుతున్నవారు కూడా క్యాబేజీని తినరాదు. తింటే థైరాయిడ్ గ్రంథి పనితీరు, థైరాయిడ్ మందులపై ప్రభావం పడుతుంది. క్యాన్సర్‌కు చికిత్స తీసుకునేవారు క్యాబేజీని తినరాదు. తింటే విరేచనాలు అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయాన్ని డాక్టర్‌తో నిర్దారించుకోవాలి. క్యాన్సర్ చికిత్స తీసుకునేవారు క్యాబేజీని తినకూడదు. విరేచనాల సమస్య ఉన్నవారు కూడా క్యాబేజీని తినరాదు. తింటే సమస్య మరింత ఎక్కువవుతుంది.