Caurd
Yogurt : ఆరోగ్యానికి పెరుగు తినటం ఎంతో మంచిది. పెరుగులో ఉండే ప్రొటీన్స్, విటమిన్లు, ఖనిజాలు మనిషికి శక్తినిస్తాయి. పాల కన్నా పెరుగు త్వరగా జీర్ణం అవుతుంది. జీర్ణ వ్యవస్ధ పఠిష్టం చేసేందుకు చక్కగా పనిచేస్తుంది. కామెర్లతో బాధపడేవారికి పెరుగు చక్కని ఔషదంగా పనిచేస్తుంది. అనేక చర్మవ్యాధులను దూరం చేసే గుణం పెరుగులో ఉంది.
అయితే కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న వారు పెరుగు తినకపోవటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తిన్నా అప్పుడు తప్ప నిత్యం అదేపనిగా పెరుగుతినటం అంతమంచిదికాదంటున్నారు. ఆస్తమా సమస్య, శ్వాసతీసుకోవటంలో ఇబ్బందులు ఉన్నవారు పెరుగును తినకపోవటమే మంచిది. ఒకవేళ తినాలనిపిస్తే పగటివేళలో మాత్రమే తినాలి. రాత్రి వేళల్లో పెరుగు తీసుకోవటం వీరికి అంతమంచిదికాదు. ఒకవేళ తీసుకుంటే శ్వాసలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
గ్యాస్ సమస్యతో బాధపడేవారికి పెరుగు మంచిదని సూచిస్తుంటారు. అయితే బాగా పులిసిన పెరుగు, మజ్జిగ లాంటివి తీసుకుంటే సమస్య మరింత ఝటిలం అయ్యే అవకాశాలే ఎక్కవ. గ్యాస్ సమస్యలు ఉన్నవారు పెరుగు తీసుకోక పోవటమే మంచిది. ఇలాంటి వారు రాత్రిపూట పెరుగు తినకపోవటం ఉత్తమం. లాక్టోస్ అసహనం ఉన్నవారు పెరుగు తీసుకోవటం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది.
కీళ్ళనొప్పులతో బాధపడేవారు పెరుగుకు దూరంగా ఉంటే మంచిది. ఇలాంటి వారు పెరుగు రోజువారి ఆహారంలో తీసుకోవటం వల్ల కీళ్ళ నొప్పులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల పై సమస్యలతో బాధపడేవారు పెరుగును అప్పుడప్పుడు మినహా రోజువారిగా తీసుకోవటం అంతమంచిదికాదని నిపుణులు సూచిస్తున్నారు.