kidneys : కిడ్నీల విషయంలో నిర్లక్ష్యం వద్దు!

ఉప్పు హైబీపీని తెచ్చి పెట్టడమే కాదు, మూత్రపిండాలకు నష్టాన్ని కలిగిస్తుంది. ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఉప్పును మితంగా వేసుకోవాలి. రోజుకు అయిదు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోరాదు.

Kidneys

kidneys : మనిషి శరీరంలో మూత్రపిండాలు పక్కటెముకకు దిగువన వెనుక భాగంలో ఉంటాయి. అవి పిడికిలి పరిమాణం, ఐదు ఔన్సుల బరువు కలిగి ఉంటాయి. మూత్రపిండాలు ప్రతిరోజూ 200 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి, టాక్సిన్స్, వ్యర్థాలు, నీటిని తొలగించడం ద్వారా రక్త ఖనిజాలను సమతుల్యంగా ఉంచుతాయి. మూత్రపిండాలు రక్తపోటు, ద్రవ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నియంత్రిస్తాయి. బలమైన, ఆరోగ్యకరమైన ఎముకల కోసం విటమిన్ డిని సక్రియం చేస్తాయి.

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా వ్యాధి బారిన పడ్డాయా అని తెలుసుకునేందుకు రెండు సాధారణ పరీక్షలు ద్వారా తెలుసుకోవచ్చు. మూత్రంలో ప్రోటీన్ పోతుంటే మూత్రపిండ దెబ్బతింటుందనటానికి ప్రారంభ సంకేతాలలో ఒకటిగా చెప్పవచ్చు. మూత్రంలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటే, కిడ్నీ ఫిల్టర్‌లు దెబ్బతిన్నాయని, ప్రొటీన్‌ లీక్‌ అవుతుందని అర్థం. రెండోది క్రియేటినిన్ అనేది మూత్రపిండాల ద్వారా తొలగించబడే వ్యర్థ ఉత్పత్తి. మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థాలను ఎంత బాగా ఫిల్టర్ చేస్తున్నాయో ఈజీఎఫ్ఆర్ ద్వారా తెలుసుకోవచ్చు.

మనం తినే ఆహారం, నీళ్లు, అలవాట్లు కిడ్నీలపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడడం, కిడ్నీలు పాడవడం, చివరికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ వరకు సమస్య చేరుతుంది. మద్యపానం శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మూత్రపిండాలు దీని వల్ల దెబ్బతింటాయి. కిడ్నీలపై తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తుంది.

ఉప్పు హైబీపీని తెచ్చి పెట్టడమే కాదు, మూత్రపిండాలకు నష్టాన్ని కలిగిస్తుంది. ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఉప్పును మితంగా వేసుకోవాలి. రోజుకు అయిదు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోరాదు. మధుమేహం లేని వారు రోజుకో స్వీటు తినవచ్చు. పంచదార కలిపిన పదార్థాల వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా షుగర్ ఉన్నవారు తీపి పదార్ధాలు తినటం తగ్గించాలి. అదేక్రమంలో చాలా మంది యూరిన్ వచ్చిన వెంటేనే వెళ్ళకుండా ఆపుకుంటూ ఉంటారు. ఇది తరచూ చేస్తే కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది. కిడ్నీలో రాళ్లు పేరుకుపోయే ప్రమాదం పొంచిఉంటుంది. ప్రోటీన్స్ ఉండే ఆహారం తినడం చాలా అవసరం. మోతాదుకు మించి అతిగా తినడం వల్ల కిడ్నీలు ఒత్తిడికి గురవుతాయి.

శరీరానికి తగినంత నిద్ర లేకపోయినా కిడ్నీలు సరిగా పనిచేయవు. ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించాలి. ముఖ్యంగా రాత్రిళ్లు మేల్కోని ఉండటం వంటివి మంచిది కాదు. నీరు తక్కువగా తాగడం వల్ల కిడ్నీల పనితీరు కూడా మందగిస్తుంది. రోజుకు ఏడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్లకు తాగితే కిడ్నీలు చురుగ్గా పనిచేసి ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ఎ, విటమిన్ బి6, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజూ వారి మెనులో చేర్చుకోవాలి. దీని వల్ల మూత్ర పిండాల పనితీరు మెరుగుపడుతుంది.