Tea : టీ ఎక్కువసార్లు తాగే అలవాటుందా!…అయితే జాగ్రత్త?

టీ తాగినా బరువు పెరగకుండా ఉండాలనుకుంటే కొన్ని చిట్కాలను పాటించటం ఉత్తమం. టీ కోసం సేకరించే పాలను వెన్న తీసేసిన వాటిని ఎంచుకోవటం మంచిది.

Tea

Tea : ఉదయం నిద్రలేవగానే ఓ కప్పు టీ తోనే దినచర్యను ప్రారంభించే వారు చాలా మంది ఉన్నారు. టీ తాగకపోతే ఆరోజంతా ఏదో కోల్పోయిన వారిలా ఉంటారు. మరికొంత మందైతే విపరీతమైన తలనొప్పి, చిరకాకుతో ఏదో పోగొట్టుకున్న వారిలా కనిపిస్తుంటారు. ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలా మంది వివిధ రకాల సమస్యలతో సతమతమౌతూ ఉంటారు. వాటి నుండి కాస్తా రిలీఫ్ పొందేందుకు టీ తాగటం అలవాటుగా మార్చుకుంటారు. టీ తాగడం వల్ల ఒత్తిడి, డయాబెటిస్, క్యాన్సర్, దంతక్షయం వంటి ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది.

వాస్తవానికి రోజుకు రెండు , మూడు కప్పుల టీ తాగటం వల్ల ఆరోగ్యానికి పెద్దగా కలిగే నష్టమేమి లేకపోయినప్పటికీ అదేపనిగా కప్పుల కొద్దీ టీ తాగితే మాత్రం హెల్త్ కు ముప్పుతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసార్లు టీ తాగటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి కారణం మనం తీసుకునే టీని పాలు, పంచదార కలిపిన మిశ్రమంతో చాలా మంది  తయారు చేసుకుంటారు. పాలు కలిపి తయారు చేయటం వల్ల శరీరానికి విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు అందుతాయి. ఎముకలు కూడా దృఢంగా మారాతాయి. అంతవరకు బాగానే ఉన్నా పాలు, పంచదారల ప్రభావం కారణంగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. టీ అధికసార్లు తీసుకోవడం వల్ల కేలరీలు అధికమోతాదులో శరీరంలోకి చేరతాయి. అంతేకాకుండా చాయ్‌ తయారీ కోసం వినియోగించే టీ పౌడర్‌లో నికోటిన్‌, కెఫిన్‌ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కు కారణమవుతాయి.

టీ తాగినా బరువు పెరగకుండా ఉండాలనుకుంటే కొన్ని చిట్కాలను పాటించటం ఉత్తమం. టీ కోసం సేకరించే పాలను వెన్న తీసేసిన వాటిని ఎంచుకోవటం మంచిది. అలాగే టీలో కాస్త అల్లం ముక్క, తులసి ఆకులు, యాలుగలు, వంటివి వాడటం బెటర్. మరీ ముఖ్యంగా బరువు పెరగటానికి కారణమయ్యే పంచదార విషయంలో జాగ్రత్తలు పాటించటం మర్చిపోకూడదు. టీలో పంచదారకు బదులుగా తేనె, బెల్లంను వాడుకోవటం వల్ల క్యాలరీలను తగ్గించుకోవచ్చు. టీని ఎక్కవసార్లు తాగటం వల్ల దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాల కంటే అనారోగ్య సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజుకి రెండు నుంచి మూడు కప్పుల టీ తాగటం మంచిది. అంతకంటే ఎక్కవ వద్దు.

గమనిక ; ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యుల సూచనలు, సలహాలను పాటిస్తూ అలవాట్లలో మార్పులు చేసుకోవటం మంచిది.