Yogurt : రోజుకో కప్పు పెరుగు తింటే…ఆరోగ్యానికి ఢోకాలేదా?…

మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజూ పెరుగుని, మజ్జిగను వాడటం మంచిది. కడుపులో అల్సర్ ఉండే వారిలో, గ్యాస్ట్రిక్ ఇరిటెషన్ తో బాధపడేవారికి, హైపర్ ఎసిడిటీతో బాధపడేవారికి పెరుగు అత్యద్భుతమైనదిగా చెప్పవచ్చు.

Curd

Yogurt : రోజువారిగా తీసుకునే ఆహారాపదార్ధాల్లో పెరుగుకూడా ఒకటి. పెరుగును మజ్జిగగా చేసుకుని తాగటంతోపాటు, వివిధ రకాల వంటకాల్లో కూడా వినియోగిస్తారు. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే అనేక పోషకాలు శరీరానికి దోహదపడతాయి. కాల్షియం, విటమిన్ బి2, బి12, పొటాషియం, మెగ్నీషియం, వంటివి శరీరానికి అందుతాయి. ఇది ప్రోబయోటిక్ గా పనిచేయటంతోపాటు ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియాలు జీర్ణ వ్యవస్ధను మెరుగుపర్చేందుకు సహాయపడతాయి.

సంపూర్ణ ఆరోగ్యానికి రోజుకు ఒక కప్పు పెరుగుతినమని నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తిని బలపర్చటంలో దీనిపాత్ర కీలకం. ఎముకలు, పండ్లు బలంగా తయారయ్యేందుకు పెరుగు సహాయపడుతుంది. పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా, ముడతలను తొలగిస్తుంది. యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల, మొండిగా ఉండే చుండ్రును తొలగించడానికి సహాయపడుతుంది. ఇది యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది. పెరుగుకు కాస్తంత నిమ్మరసం జోడించి, దానిని మీ ముఖానికి రాసి, పదినిమిషాలు ఉంచిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే చర్మం మెరుస్తుంది.

మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజూ పెరుగుని, మజ్జిగను వాడటం మంచిది. కడుపులో అల్సర్ ఉండే వారిలో, గ్యాస్ట్రిక్ ఇరిటెషన్ తో బాధపడేవారికి, హైపర్ ఎసిడిటీతో బాధపడేవారికి పెరుగు అత్యద్భుతమైనదిగా చెప్పవచ్చు. కామెర్లు వచ్చిన వారికి పెరుగు, మజ్జిగ అధిక మొత్తంలో ఆహారంగా ఇస్తూ దాంట్లో కొద్దిగా తేనె కూడా కలిపి ఇస్తే మరింతగా త్వరగా కోలుకొనే అవకాశం ఉంది. సాధారణంగా పడుకునే ముందు ప్రతి రోజు తప్పకుండా పెరుగన్నం తిని పడుకుంటే చాలా ఈజీగా అరుగుదల ఉంటుందని చెబుతుంటారు. అయితే మరికొందరు మాత్రం పెరుగుకు చల్లబరిచే గుణం ఉంటుంది కాబట్టి రాత్రిపూట పెరుగు తిని పడుకోవడం సరైనదికాదంటారు.

బ్రెయిన్ బాగా పనిచేసేలా చేయటంతోపాటు ఒత్తిడి, టెన్షన్, ఆదుర్తా వంటివి పోగొట్టడంలో పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. పైల్స్ సమస్యలుంటే పెరుగు చాలా మేలు చేస్తుంది. దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు పెరుగులో కాస్త చక్కెర లేదా మిరియాలపొడి కలుపుకుని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రాత్రి సమయంలో పెరుగుకు మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది అందుకోసమే రాత్రిపూట పెరుగుతో భోజనం చేసి పడుకుంటే పెరుగు మ్యూకస్ ను ఏర్పరుస్తుంది. దీనివల్ల కఫం,దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధ పడాల్సి ఉంటుంది. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తింటే మంచిది. బరువు తగ్గాలనుకునే వారు పెరుగుకు బదులు మజ్జిగ తాగండం మంచిది.