Apples
Apples : ఆరోగ్యకరమైన పండ్లలో యాపిల్స్ ఒకటిగా చెప్పవచ్చు. యాపిల్ లో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, ఖనిజాలు, విటమిన్ ఎ, సి, కె, పుష్కలంగా లభిస్తాయి. యాపిల్ లో కొవ్వు తక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి యాపిల్ ఎంతో మేలు చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే యాపిల్ ను రోజుకు ఒకటైనా తినమని వైద్యులు సూచిస్తుంటారు.రోజుకో యాపిల్ తింటే వైద్యుని అవసరమే ఉండదన్న మాట నిజమే అయినప్పటికీ అదే పనిగా రోజుకు మూడు నాలుగు యాపిల్స్ లాగించేస్తుంటే మాత్రం కోరి కొత్త అనారోగ్యసమస్యలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అతిగా తినటం వల్ల శరీరంలో దుష్ర్పభావాలు తప్పవని చెప్తున్నారు. ఆపిల్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియలు సక్రమంగా ఉండేందుకు దోహదపడే మాట వాస్తవమే అయినప్పటికీ ఫైబర్ అధిక మోతాదులో తీసుకోవటం వల్ల మలబద్ధకం సమస్య ఉత్పన్నమౌతుంది. అధికంగా ఆపిల్స్ లోని ఫైబర్ శరీరంలో చేరడం వల్ల పొట్ట ఉబ్బరం, మలబద్ధకం సమస్యలు ఉత్పన్నం అవుతాయి. రోజుకు 70 గ్రాములకు మించి శరీరంలో చేరితో జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
యాపిల్స్‌లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు రోజుకు రెండు పండ్లు వరకు తినవచ్చు. అంతకు మించి తింటే మాత్రం రక్తంలో చక్కెర స్ధాయిలు పెరుగుతాయి. ఇన్సులిన్ సున్నితత్వం అధిక మోతాదులో యాపిల్స్ తినటం వల్ల దెబ్బతింటుంది. దీని వల్ల షుగర్ వ్యాధి నియంత్రణకు వాడుతున్న మందుల పనితీరుపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. పురుగు మందుల అవశేషాలు అధిక ఉండే పంట్ల జాబితాలో యాపిల్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా యాపిల్స్ ఎక్కువ కాలం నిల్వఉండేందుకు రసాయనాలను వినియోగిస్తారు. అలాంటి యాపిల్స్ ను ఎక్కవ మోతాదులో తీసుకోవటం వల్ల విషరసాయనాల ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది.
ఎక్కవ మోతాదులో యాపిల్స్ తినటం వల్ల బరువు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎక్కవ మోతాదులో శరీరానికి లభించే కార్బోహైడ్రేట్లు బరువును పెంచుతాయి. యాపిల్స్ లో ఆమ్ల శాతం ఎక్కవ మోతాదులో ఉంటుంది. దంతాలపై దీని ప్రభావం ఉంటుంది. ఎక్కవ మొత్తంలో యాపిల్స్ తినేవారిలో దంతపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఆపిల్ పండ్లను అధికంగా తినటం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. యాపిల్ లో ఉండే విత్తనాలు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదు. యాపిల్ తినే సమయంలో విత్తనాల వల్ల దీర్ఘకాలికంగా సమస్యలు వస్తాయి. కడుపులో నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.