Heartburn : అప్పుడప్పుడు గుండెల్లో మంటగా అనిపిస్తుందా? జాగ్రత్తలు తప్పనిసరా?

వేళకు ఆహారం తీసుకోకుండా టీ, కాఫీలతో గడిపే వారిలో గుండె ల్లో మంట చవిచూడాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో టీ, కాఫీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. చిప్స్, చాక్లెట్ వంటిటి ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.

Heartburn

Heartburn : మారిన జీవనశైలితో చాలా మంది తీసుకునే ఆహారంలో మార్పులు వచ్చాయి.  మసాలాలు, కారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినేవారిలో జీర్ణ సంబంధ సమస్యలు వస్తున్నాయి. ఎసిడిటీ, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. గ్యాస్ ట్రబుల్ సమస్య వల్ల ఏది తిన్నా కూడా గుండెల్లో మంటగా అనిపించడం సరిగా జీర్ణకాకపోవటం వంటి సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.

యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంటలు మనలో చాలా మంది ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు. గ్యాస్ట్రిక్ గ్రంథులు జీర్ణ ప్రక్రియకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసినప్పుడు ఇలాంటి సమస్యను చవిచూడాల్సి వస్తుంది. కొందరిలో ఛాతీలో, రొమ్ము ఎముక వెనుక నొప్పి వంటివి ఎదురవుతాయి.

ప్రాసెస్డ్ ఫుడ్స్‌ కూడా ఇందుకు ప్రధాన కారణం. వీటిలో ఉండే సంతృప్త కొవ్వు, సోడియం, ఉప్పు,బాడీలో యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచుతుది. వాటిని ఎక్కువగా తినడం వల్ల ఎసిడిటీ సమస్య
మరింత పెరుగుతుంది.

అంతేకాకుండా చాలా మంది అధిక మోతాదులో ఆహారం తీసుకునే వారిలో ఈ సమస్య ఉంటుంది. ఆహారం రుచిగా ఉందని చెప్పి అదేపనిగా పీకలదాకా తింటే మాత్రం ఇలాంటి సమస్యను
ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మసాలలతో కూడిన బిర్యానీలు వంటివి చేటు కలిగిస్తాయి.

వేళకు ఆహారం తీసుకోకుండా టీ, కాఫీలతో గడిపే వారిలో గుండె ల్లో మంట చవిచూడాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో టీ, కాఫీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. చిప్స్, చాక్లెట్ వంటిటి ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.

గుండెల్లో మంట సమస్యను తరచూ అనుభవిస్తున్నవారు రోజులో తక్కువ తక్కువగా ఎక్కువసార్లు భోజనం చేయండి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

కెఫిన్, చాక్లెట్లు ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే పులుపు కలిగిన నారింజ, ద్రాక్షపండు వంటి పండ్లు, సి విటమిన్ కలిగిన పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. మసాలాలు, ఉల్లిపాయలు, టమోటాలకు కూడా దూరంగా ఉండాలి.

డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్, ఆల్కహాల్ తాగడం, కొవ్వు అధికంగా ఉండే భోజనం తీసుకోవడం వంటివి గుండెల్లో మంటను కలిగిస్తాయి. అధిక బరువు, ఊబకాయం ఉన్నవారిలో ఈ సమస్య ఉంటుంది. కాబట్టి బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి.

రోజువారిగా వ్యాయామాలు చేయటం వల్ల మంచి పలితం ఉంటుంది. రోజుకు 30 నిమిషాలపాటు స్విమ్మింగ్, జాగింగ్, వంటి వ్యాయామాలు చేయాలి. భోజనం చేసిన వెంటనే వేగంగా పరిగెత్తటం వంటివి చేయరాదు.