Protein Foods : వీటిలో ఉండే ప్రొటీన్ ఎంత మంచిదో తెలుసా.. తింటే ఎన్ని ప్రయోజనాలో !

మాంసానికి ప్రత్యామ్నాయంగా పన్నీర్ తింటే మంచిదంటారు డాక్టర్లు. దీన్ని వెజిటేరియన్ చికెన్ గా పిలుస్తారు. అలాగే సోయాబీన్, మిల్ మేకర్లను కూడా ప్రోటీన్లకు ఉత్తమ వనరులుగా గుర్తించారు. సోయా మిల్క్ తో తయారైన టోఫు కూడా ఈ లిస్ట్ లో ముందుంటుంది.

Protein Foods

Protein Foods : కార్బోహైడ్రేట్లు తగ్గించండి.. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోండని తరచుగా చెబుతుంటారు డాక్టర్లు. మాంసాహారులకుప్రొటీన్లకుకొదవ లేదు. శాకాహారులకు మాత్రం ప్రొటీన్లు వేటి ద్వారా, ఎలా తీసుకోవాలో ఎప్పుడూ కన్ఫ్యూజనే. మాంసాహారం తినని వాళ్లలో ప్రొటీన్ తగినంత అందదు అని అనుకుంటారు చాలామంది. కానీ శాకాహారంలో కూడా పుష్కలంగా మంచి ప్రొటీన్లు ఉంటాయి. అవేంటంటే..

READ ALSO : Joint Pains : ఈ లడ్డు రోజుకు ఒకటి తింటే చాలు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు మాయం !

పప్పులు.. బీన్స్..

పప్పులు, అన్నం కలిపి కిచిడీలా చేసుకొని తిని చూడండి. ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే చిక్కుళ్లలో కూడా అద్భుతమైన ప్రోటీన్స్ ఉంటాయి. బీన్స్, బఠాణీలు.. ఇలా చాలా చిక్కుడు జాతికి చెందిన అన్నిటిలో ప్రోటీన్స్ ఉంటాయి. కాయధాన్యాల్లో 100 గ్రాములకు.. 9 గ్రాముల ప్రోటీన్, బ్లాక్ బీన్స్ లో 21 గ్రాములు, కిడ్నీ బీన్స్ లో 24గ్రాముల ప్రోటీన్స్ లభ్యమవుతాయి. 100 గ్రాముల పచ్చి బఠాణీల్లో 5 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.

సోయా ఉత్పత్తులు :

మాంసానికి ప్రత్యామ్నాయంగా పన్నీర్ తింటే మంచిదంటారు డాక్టర్లు. దీన్ని వెజిటేరియన్ చికెన్ గా పిలుస్తారు. అలాగే సోయాబీన్, మిల్ మేకర్లను కూడా ప్రోటీన్లకు ఉత్తమ వనరులుగా గుర్తించారు. సోయా మిల్క్ తో తయారైన టోఫు కూడా ఈ లిస్ట్ లో ముందుంటుంది. 100 గ్రాముల టోఫులో 8 గ్రాముల ప్రోటీన్ లభ్యవుతుంది. ఇతర సోయా ఉత్పత్తుల్లో 100 గ్రాముల్లో దాదాపు 11 గ్రాముల వరకు ప్రోటీన్ అందుతుంది.

READ ALSO : Guntur: రగిలిపోతున్న ముస్తఫా.. మేయర్ ని టార్గెట్ చేసిన ఎమ్మెల్యే.. గుంటూరు వైసీపీలో ఏం జరగుతోంది?

క్వినోవా :

క్వినోవాలోఅమైనో ఆమ్లాలు అధికం. ఇవి మన శరీరానికి తగినంత ప్రోటీన్ ని మాత్రం అందిస్తుందని చెప్పొచ్చు. 100 గ్రాముల క్వినోవాలో 14 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. అన్నం కోసం ప్రత్యామ్నాయంగా కాకుండా సలాడ్స్ రూపంలో దీన్ని తింటే మంచిది.

డ్రై ఫ్రూట్స్ :

నట్స్.. కొవ్వులతో సమృద్ధిగా ఉండడమే కాకుండా ఇందులో ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. ఆహారంలో నట్స్ తో పాటు, సీడ్స్ కూడా చేర్చుకోండి. మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి. బాదం పప్పులో 100 గ్రాముల్లో 21 గ్రాముల్లో ప్రోటీన్ ఉంటుంది. చియా విత్తనాల్లో 17 గ్రామాలు, గుమ్మడికాయ గింజల్లో, అవిసె గింజల్లో 19 గ్రాముల ప్రోటీన్స్ లభ్యమవుతాయి.

READ ALSO :Driving Licence : ఏపీలో వాహనదారులకు అలర్ట్.. చేతిలో మొబైల్ ఉంటే చాలు.. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ కార్డులకు సెలవు

తృణధాన్యాలు :

తృణధాన్యాలను ప్రోటీన్ రిచ్ డైట్ గా పిలవచ్చు. బ్రౌన్ రైస్ ని ఇప్పుడు వైట్ రైస్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. 100 గ్రాముల బ్రౌన్ రైస్ లో 2.7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల ఓట్స్ లో 11 గ్రాముల ప్రోటీన్, బార్లీలో 2.3 గ్రాముల ప్రోటీన్స్ లభ్యమవుతాయి.

పాల ఉత్పత్తులు :

పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్స్ అనే కాదు.. కాల్షియం, ఇతర మూలకాలు కూడా అధికంగా ఉంటాయి. శాకాహారులు కచ్చితంగా పాల ఉత్పత్తులను తీసుకోవాలి. 100 గ్రాముల పెరుగులో 10 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. జున్ను, కాటేజ్ చీజ్లో 11 గ్రాములు, చెడ్డార్ చీజ్ లో 25 గ్రాములు, స్విస్ చీజ్ లో 27 గ్రాముల చీజ్ ఉంటుంది.

READ ALSO : Paddy Nursery : ఖరీఫ్ వరినారుమడులను పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారు కోసం చేపట్టాల్సిన మెళకువలు

పాల ప్రత్యామ్నాయాలు..

శాకాహారులైనా సరే.. కొందరికి పాలు, పెరుగు తినే అలవాటు ఉండదు. అలాంటివారు పాలకు ప్రత్యామ్నాయంగా మొక్కల ఆధారిత పాలను ట్రై చేయొచ్చు. 100 గ్రాములసోయా మిల్క్ లో 3.3 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ఆల్మండ్ మిల్క్ లో 1 గ్రాము వరకు ప్రోటీన్ లభిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు