kokum health benefits
Kokum Fruit : వేసవి కాలంలో అధిక వేడికి మన శరీరం చల్లని పదార్ధాలను, పండ్లను తినాలని ఆరాటపడుతుంది. వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు నీటిని తీసుకోవచ్చు. అయితే ఈ జీరో క్యాలరీ ద్రవంతో పాటు మనకు కొన్నిసార్లు మరింత పోషకమైనవి అవసరం అవుతాయి. అలాంటి వాటి గురించి చెప్పుకోవాలంటే వేసవి సూపర్‌ఫ్రూట్ కోకుమ్ గురించి తెలుసుకోవాల్సిందే.
READ ALSO : Eat Banana : అరటి పండును ఏసమయంలో తినకూడదో తెలుసా?
కోకుమ్ పండు నుండి తీసిన జ్యూస్ ఒక గొప్ప యాంటీఆక్సిడెంట్ తోకూడిన ప్రసిద్ధ వేసవి పానీయంగా ప్రసిద్ధి చెందింది. దీనిని గార్సినియా ఇండికా అని కూడా అంటారు. కోకమ్‌లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి3, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ మరియు జింక్ ఉన్నాయి. కోకుమ్‌లో ఎసిటిక్ యాసిడ్ మరియు హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ లు కూడా ఉన్నాయి.
కోకుమ్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ;
1. రోగనిరోధక శక్తి బూస్టర్ ; ఈ పండులోని అనేక భాగాలు యాంటీ బాక్టీరియల్ , యాంటీ-వైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ పండును అనేక బ్యాక్టీరియా , వైరల్ ఇన్ఫెక్షన్‌ల నుండి రక్షించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని సహాయంతో పేగు అలెర్జీలను తగ్గించవచ్చని అధ్యయనాలు కూడా నిరూపించాయి.
READ ALSO : Sapota : కంటి చూపును పెంచి…శరీరానికి శక్తినిచ్చే సపోటా
2. జీర్ణక్రియలో సహాయపడుతుంది ; తీపిగా, చిక్కగా అత్యంత రిఫ్రెష్ కోకుమ్ షర్బత్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అసిడిటీ, అజీర్ణంతో బాధపడుతున్న రోగులు ఈ పానీయం తాగడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
3. శరీరానికి సహజ శీతలకరణి ; కోకం పండు సహజ శీతలకరణి. ఒక గ్లాసు కోకుమ్ రసం వేసవిలో మండే వేడి నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది అద్భుతమైన రిఫ్రెష్ డ్రింక్ . అంతేకాకుండా శక్తినిస్తుంది. డీహైడ్రేషన్‌ను కూడా నివారిస్తుంది.
4. గుండెకు మంచిది ; కోకమ్‌లో క్యాలరీలు తక్కువగా ఉన్నా పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇది సున్నా కొలెస్ట్రాల్ కలిగి ఉంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఇది మన రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ కారకాలన్నీ మన గుండెను రక్షిస్తాయి.
READ ALSO : Pomegranate Fruits : గుండెతోపాటుగా మెదడు ఆరోగ్యానికి మేలు కలిగించే దానిమ్మ పండ్లు!
5. చర్మ సంరక్షణ ; అత్యంత ప్రభావవంతమైన యాంటీఆక్సిడెంట్ అయినందున, వృద్ధాప్య లక్షణాలను తగ్గించే చికిత్సలలో తప్పకుండా ఉపయోగించబడుతుంది. ఇది చర్మాన్ని మరమ్మత్తు, నయం చేయడమే కాకుండా చర్మ కణజాల నష్టాన్ని ఎదుర్కోవటానికి కూడా సహాయపడుతుంది.
6. మధుమేహం నిర్వహణలో సహాయపడుతుంది ; కోకమ్‌లో అద్భుతమైన యాంటీ డయాబెటిక్ సామర్థ్యం ఉంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా. ఇది మన శరీరంలో ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతుంది, తద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చేస్తుంది. ఇది డయాబెటిస్ నిర్వహణలో కోకుమ్ ఉపయోగపడుతుంది.
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.