Weight Gain After Marriage
Weight Gain : వివాహం అనేది మనిషి జీవితంలో జరిగే మహత్తర కార్యం. వివాహ బంధం ద్వారా మనిషి జీవితకాలం సంతోషకరంగా పొడిగించబడుతుందని అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వివాహం తరువాత చాలా మంది అనుకోకుండా బరువు పెరగిపోతుంటారు. దీనికి ప్రధాన కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులు కావచ్చు. ఓ అధ్యయనం ప్రకారం సింగిల్ గా ఉన్న సమయంలో చాలా మంది ఎక్కవగా తినటానికి ఏమాత్రం ఇష్టం చూపించరు. అయితే వివాహం తరువాత మాత్రం జంటగా కలిసి అధిక మొత్తంలో ఆహారం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అంతేకాకుండా రోజు వారి వ్యాయామాలకు స్వస్తిచెబుతారు.
అంతేకాకుండా చాలా మంది భార్యలు తమ భర్తలను సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు. భర్తల కోసం ప్రేమగా వివిధ రకాల వెరైటీ ఆహారాలను తయారు చేసి వారికి అందిస్తారు. సహజంగానే ఇద్దరు కలసి మోతాదుకు మించి ఆహారాలను తీసుకుంటారు. దీని వల్ల సైతం బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. 10వేల మంది జంటలపై జరిపిన ఓ అధ్యయనంలో వివాహం తరువాత చాలా మంది జంటల్లో బాడీ మాస్ ఇండెక్స్ పై గణనీయమైన ప్రభావం పడటం పరిశోధకులు గమనించారు. దీనికి ఆహారపు అలవాట్లు, భావోద్వేగాలు , సంతోషం కూడా కారణమని గుర్తించారు.
వివాహ తరువాత బరువు పెరగకుండా ఉండాలంటే :
వివాహమైన చాలా మంది జంటలు ఇంట్లో వండుకుని తినేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇంట్లో వంట తయారీ చేస్తుంటే మాత్రం తప్పనిసరిగా తక్కువ కేలరీలున్న ఆహారాన్ని ఎంచుకోవటం మంచిది. పండ్లు, కూరగాయలు వంటివాటిని నిల్వ చేయటానికి మాత్రమే ఫ్రిజ్ ఉపయోగించాలి. ఫ్రిజ్ లో స్వీట్లు, చక్కెర పానీయాలు, స్నాక్స్ వంటి వాటిని నిల్వ చేస్తే పదేపదే వాటిని తినేందుకు ప్రయత్నిస్తారు. తద్వారా బరువు పెరిగేందుకు అస్కారం ఏర్పడుతుంది.
పెళ్ళైన జంటలు రోజువారి వ్యాయామాలు చేయటం మంచిది. ఉదయం నడకను అలవాటుగా మార్చుకోవాలి. వివాహం తరువాత శరీరంలోకి వచ్చే అదనపు కేలరీలను కరిగించేందుకు వ్యాయామాలు ఉత్తమార్గంగా చెప్పవచ్చు. అవసరమైతే భార్య,భర్తలు ఇద్దరు కలసి వ్యాయామాలు చేయటం మంచిది. చాలా మంది వివాహం తరువాత సమస్యలు ఎదుర్కొంటుంటారు. వైవాహిక జీవితంలో ఏర్పడే ఇబ్బందులతో ఒత్తిడికి లోనై అధిక ఆహారాన్ని తినటం, కొన్ని సార్లు ఆహారం లేకుండా గడపటం, నిద్రలేమి వల్ల సైతం అధిక బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.
ఇంటి నుండి బయటకు వెళ్ళే సమయంలో , షాపింగ్ లకు వెళ్ళే సదర్భంలో వీలైనంత వరకు కారు , బైక్ ను వదిలిపెట్టే నడవటానికి ప్రయత్నించటం మంచిది. దీని వల్ల డబ్బు అదా కావటంతోపాటు, శరీరానికి వ్యాయామంలా ఉంటుంది. పడకగదిలో తరుచుగా శృంగార జీవితం ద్వారా కూడా అదనపు కేలరీలు కరిగించటం ద్వారా బరువు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి.