plastic buckets in bathroom
plastic buckets in bathroom : పూర్వం రోజుల్లో ఇత్తడి బకెట్లు వాడేవారు. ఆ తరువాత అందుబాటులోకి వచ్చిన అల్యూమినియం బకెట్లు వాడేవారు. ఇత్తడి, అల్యూమినియం బకెట్లు రంగుల్లో తేడాలు ఉండవు. కానీ ఇప్పుడంతా ప్లాస్టిక్ బకెట్ల వాడకమే. దీంతో ప్రతీ ఇంట్లోను బాత్రూముల్లో ప్లాస్టిక్ బకెట్లు ఉంటుంటాయి. రంగు రంగుల ప్లాస్టిక్ బకెట్లు వాడుతుంటారు.
ఇదంతా ఎందుకు అంటే బాత్రూముల్లో వాడే బకెట్ల రంగులు ఏ రంగులపడితే ఆరంగులు వాడకూడదట. సాధారణం మనుషులపై రంగుల ప్రభావాలు ఎంతగా ఉంటాయో తెలిసిందే.అందుకే ఇంటి గోడలకు వాడే రంగుల్లో కూడా సాధ్యమైనంత లేత రంగులు వాడాలని నిపుణులు చెబుతుంటాయి. కొన్ని రంగులు మనిషి మానసిక స్థితిపై ఒత్తిడి కలిగిస్తాయి. కొన్ని రంగులు ప్రశాంతతను కలిగిస్తాయి. అందుకే ఇంటి గోడలకు వాడే రంగులు లేత రంగులు ఉండాలని చెబుతుంటారు.
అలాగే బాత్రూముల్లో వాడే బకెట్ల రంగులు కూడా అన్ని రంగులు వాడకూడదని చెబుతున్నారు మానసిక నిపుణులు. అలాగే వాస్తు నిపుణులు కూడా అదే చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే కొన్ని రంగుల వస్తువులు ఇంట్లో నివసించే వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాగే అవి ఉండే స్థానం కూడా ఇంటిపై ప్రభావం చూపుతాయట.
ఇంట్లో వస్తువుల దిశ, వాటిని ఉంచే విధానంతో పాటు వాటి రంగు వ్యక్తి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయట. వస్తువుల రంగు వారి ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి బెడ్‌రూమ్, కిచెన్, బాల్కనీ సహా బాత్రూంలో వినియోగించే వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
దీంట్లో భాగంగా బాత్రూంలో సరైన రంగు వస్తువులను ఉంచకపోవడం వల్ల ఇంట్లో ప్రతికూలత వ్యాపిస్తాయట. దీంతో ఆర్థిక సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయట. బాత్రూమ్ ఎప్పుడూ వంటగది ముందు లేదా పక్కన ఉండకూడదు. ఇది ఇంట్లో వాస్తు పరంగాను..ఆరోగ్య పరంగాను కూడా మంచిది కాదు. బాత్రూమ్ ను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎంత శుభ్రంగా ఉంచుకున్నా క్రిములకు నియలంగా బాత్రూమ్ ఉంటుందనే విషయం తెలిసిందే..అలాగే బాత్రూమ్ లో వంటగది పక్కనగానీ బెడ్రూము కు ఎదురుగా గానీ ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పుడంతా ఎటార్చెడ్ బాత్రూములే ఉంటున్నాయి. ఒకవేళ బెడ్ రూమ్ ఎదురుగా ఉండే సాధ్యమైనంత వరకు బాత్రూడ్ డోర్ మూసి వేసి ఉంచాలి. బాత్రూమ్ గోడలకు లేత రంగులు ఉండేలా చూసుకోవాలి. వాస్తు ప్రకారంగాను..మానసిక పరంగాను ముదురు రంగులు మంచివికాదు.
బాత్‌రూమ్‌లో ఉంచిన బకెట్ రంగు వాస్తు ప్రకారం చాలా ముఖ్యం. చాలా ముదురు రంగు బకెట్లు, మగ్‌లను బాత్‌రూమ్‌లో ఉంచకూడదు. అంటే ముదురు ఎరుపు, నల్లటి నలుపు వంటివి అస్సలు వాడకూడదు. బాత్రూంలో చాలా ముదురు రంగు బకెట్లు, మగ్గులు ఉంచడం మంచిది కాదు. బాత్రూంలో ఎరుపు, నలుపు రంగు బకెట్లు ఉంచడం వల్ల వాస్తుపరంగా మంచిది కాదట. కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వస్తాయట. అంతేకాదు ధన వ్యయం కూడా కలుగుతుందట. రావాల్సిన ధనం రాకపోవటం వచ్చిన నిలవకపోవటం వంటివి జరుగుతుంటాయట.
ఎరుపు రంగు అగ్నికి చిహ్నం అని అందుకే ఎరుపు రంగు బకెట్ వాడకూదట.బాత్రూమ్‌లో ఎరుపు రంగు బకెట్, మగ్‌ని ఉపయోగిస్తుంటే వాటి స్థానంలో వీలైనంత లేత రంగులవి ఉపయోగించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. బాత్రూంలో నీలం రంగు బకెట్లు, మగ్స్ ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుందట. ఈ నీలం రంగు కూడా ముదురు నీలం కాకుండా కాస్త లేత నీలం రంగు ఉంటే మంచిది. బాత్రూమ్‌లో నీలిరంగు బకెట్‌ను ఉంచడం ఆర్థిక సమస్యలున్నవారికి మ్యాజిక్ లాగా పనిచేస్తుందట.
బకెట్‌తో పాటు మగ్ కూడా నీలం రంగులో ఉంటే మరి మంచిది. నీలిరంగు బకెట్‌ను ఉంచడంతో పాటు, దానిని ఎల్లప్పుడూ నీటితో నింపి ఉంచాలి. ఖాళీగా అస్సలు ఉంచకూడదట. బకెట్‌లో నీటితో నింపితే, అది ఇంట్లో ఆనందం. శ్రేయస్సును పెంచుతుంది.