dry fish
Eat Dried Fish : అధిక రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణ వ్యాధి. దీనినే హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు, అధిక బీపీ అనేది హృదయ సంబంధ వ్యాధుల వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. సరైన ఆహారాన్ని తినడం , జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా నిర్వహించవచ్చు. హైపర్‌టెన్షన్ విషయంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తినే ఆహారాలు రక్తపోటు స్థాయిలను నేరుగా ప్రభావితం చేస్తాయి. అయితే అలాంటి ఆహారాల్లో ఎండు చేపలు ఒకటి. అధిక రక్తపోటు ఉన్నవారికి హానికరమైన ఆహారం గా ఎండు చేపలను చెప్పవచ్చు.
హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారికి ఎండిన చేప మంచిది కాదు ;
చేపలను ఆహార సంరక్షణ పద్ధతిగా ఎండబెట్టం వల్ల అందులోని నీటిని తీసివేస్తారు. ఈ ప్రక్రియతో అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎండిన చేపలలో ప్రొటీన్లు ఎక్కువగా ,కొవ్వు తక్కువగా ఉంటాయని నమ్ముతారు. ఇది కొవ్వు ఆమ్లాలు , విటమిన్లు, ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది. ఎండిన చేపలలో ఉప్ప అధికంగా ఉంటుంది. రక్తపోటును అభివృద్ధి చేసే ప్రమాదం ఉన్నవారికి చాలా హానికరం. వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల మనిషి శరీరంలో రక్తపోటు పెరిగి గుండె సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయమై అధ్యయనం చేసి, అధిక రక్తపోటు ఉన్నవారు ఎండు చేపల వినియోగానికి దూరంగా ఉండాలని వెల్లడించింది.
ఉప్పు రక్తపోటును ఎలా పెంచుతుంది?
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలో నీరు నిలువ ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ శరీరంలో ఉప్పు ఎక్కువగా చేరినప్పుడు, రక్తం రక్తనాళాలపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. మందులతో కూడా రక్తపోటు అదుపులో ఉండటం కష్టం. అధిక రక్తపోటు ఉన్నవారికి శరీరంలో సోడియం స్థాయిలు సమస్యాత్మకంగా ఉన్నాయని చాలా అధ్యయనాలు నిరూపించాయి. ఇది గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు తక్కువగా తీసుకోవాలి. కాబట్టి హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న వారు ఉప్పు అధికంగా ఉండే ఎండు చేపల ను తీసుకోవటం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిదికాదు.