Eat Banana : అరటి పండును ఏసమయంలో తినకూడదో తెలుసా?

ఆమ్లతత్త్వం కలిగిన అరటిపళ్లు పరగడుపున తింటే జీర్ణసంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ పరగడుపున అరటిపండు తినే అలవాటు ఉంటే, ఆ పళ్లను ఇతర పదార్థాలతో కలిపి తినాలి.

Do you know when not to eat banana?

Eat Banana : అరటి పండు త్వరగా కడుపు నింపేస్తుంది. ఆకలిగా వున్నవారికి ఎక్కువ శక్తినివ్వడంలో సహాయపడుతుంది. పండిన అరటి పండులో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు వుంటాయి. త్వరగా జీర్ణమవడమే కాక వ్యాయామం చేసేవారికి తక్షణ శక్తినిస్తుంది. మగ్గిపోయిన అరటి పండులో ఎక్కువ మొత్తంలో చక్కెరలు, తక్కువ మొత్తంలో పీచు పదార్థాలు వుంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. ఎన్నో పోషక విలువలతో కూడిన ఈ ఫలాన్ని పిల్లల నుంచి వృద్ధుల దాకా అందరూ ఇష్టపడి తింటారు.

ఎప్పుడు అరటి పండు తినకూడదు ;

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం తర్వాత కూడా అరటి పండును తినకూడదు.రాత్రిపూట సాధ్యమైనంతవరకు అరటి పండును తినకపోవడమే మేలు. ఒక వేళ అనుకోకుండా తీసుకుంటే మాత్రం ఒక్కోసారి జలుబు లాంటి సమస్యలు దరిచేరే అవకాశం ఉంది. ఇతర పండ్లతో లేదా పాలతో కలిపి అరటి పండును తీసుకోకూడదు. చాలామంది పాలతో కలిపి అరటి పండును తీసుకుంటే, మరికొంతమంది పాలు తాగాక దీనిని తింటుంటారు. ఇలా చేయటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

ఆమ్లతత్త్వం కలిగిన అరటిపళ్లు పరగడుపున తింటే జీర్ణసంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ పరగడుపున అరటిపండు తినే అలవాటు ఉంటే, ఆ పళ్లను ఇతర పదార్థాలతో కలిపి తినాలి. పరగడుపున ఈ పండును తినడం శ్రేయస్కరం కాదు. దీన్లో ఉండే అత్యధిక చక్కెరలు తక్షణ శక్తిని అందించినా, అంతే వేగంగా కొన్ని గంటల వ్యవధిలోనే అలసటకూ గురిచేస్తాయి.