Covid Vaccine Booster : కొవిడ్ టీకా బూస్టర్ డోసులు అవసరమా? ఎప్పుడు వస్తాయంటే?

రాబోయే రోజుల్లో కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత వ్యాక్సిన్ డోసులు కొత్త వేరియంట్లను సమర్థవంతంగా అడ్డుకుంటాయా? వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అవసరం పడతాయా? అంటే.. అవుననే వాదన వినిపిస్తోంది.

Covid Vaccine Booster Shots : రాబోయే రోజుల్లో కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత వ్యాక్సిన్ డోసులు కొత్త వేరియంట్లను సమర్థవంతంగా అడ్డుకుంటాయా? వీటికి తోడు వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అవసరం పడతాయా? అంటే.. అవుననే అంటున్నారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. భవిష్యత్తులో కరోనా వేరియంట్లను కట్టడి చేయాలంటే తప్పనిసరిగా బూస్టర్ డోసులు అవసరం పడొచ్చునని ఆయన సమాధానమిచ్చారు. కరోనా కారణంగా చాలామందిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. కొత్త వేరియంట్లు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు.

కరోనా కారణంగా దేశంలోని చాలామందిలో వ్యాధినిరోధక శక్తి తగ్గుతోంది. కొత్త వేరియంట్లు దాడి చేస్తే తట్టుకోవడం చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కొత్త వేరియంట్లను తట్టుకునేందుకు బూస్టర్ డోసులు అవసరం పడతాయని చెబుతున్నారు. రెండు పూర్తి డోసులు తీసుకున్నప్పటికీ బూస్టర్ అవసరమనే వాదన వినిపిస్తోంది. కానీ, కానీ మూడవ మోతాదు అవసరమా? అంటే అందుకు తగిన ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవలే వెల్లడించింది. కొవిడ్ టీకాలను ధనిక దేశాలు బూస్టర్లుగా కాకుండా పేద దేశాలతో షేర్ చేయాలని పేర్కొంది.

ఈ ఏడాది చివరిలో బూస్టర్ డోసులు :
ఇంతకీ కొవిడ్ బూస్టర్ డోసులు ఎప్పుడు వస్తాయంటే.. ఈ ఏడాది చివరి నాటికి బూస్టర్ డోసులు రాబోతున్నట్లు వెల్లడించారు. బూస్టర్ డోసులు తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తిని పెంచకోవచ్చునని సూచిస్తున్నారు. అలాగే అన్ని రకాల వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ బూస్టర్లు ఉపయోగపడతాయని గులేరియా తెలిపారు. ప్రస్తుత వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే బూస్టర్ డోసులు పంపిణి చేయనున్నట్టు వెల్లడించారు. చిన్నారుల వ్యాక్సిన్ ఈ ఏడాదిలోనే అందుబాటులోకి రానుందని తెలిపారు. దానికి సంబంధించి ట్రయల్స్ కూడా జరుగుతున్నాయని చెప్పారు. సెప్టెంబర్ నాటికి ఈ ట్రయల్స్ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని గులేరియా పేర్కొన్నారు. చిన్నారుల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. దశలవారీగా పాఠశాలలు తెరిచేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

కోవాక్సిన్ బూస్టర్ డోసుల ట్రయల్స్ :
భారత్ బయోటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్ మూడవ బూస్టర్ డోసు ట్రయల్స్ ఫలితాలు ఈ ఏడాది నవంబర్ నాటికి వస్తాయని ఓ నివేదిక వెల్లడించింది. దేశీయంగా వ్యాక్సిన్ బూస్టర్ మోతాదు మొదట మే నెలలో ట్రయల్స్ ప్రారంభం కాగా.. ఆ తరువాత ఢిల్లీ, పాట్నాలోని ఎయిమ్స్ లో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. కోవాక్సిన్ బూస్టర్ షాట్ కోసం దేశవ్యాప్తంగా 12 కేంద్రాలు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. మూడో బూస్టర్ మోతాదుకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఏప్రిల్‌లో భారత్ బయోటెక్‌కు అనుమతులు మంజూరు చేసింది. మే నెలలో నిర్వహించిన మొదటి ట్రయల్ ఫలితాలు ఆగస్టులో రానున్నాయి.

ట్రెండింగ్ వార్తలు