అద్బుతం జరిగింది : 118 ఏళ్ల బామ్మకు గుండె ఆపరేషన్

  • Publish Date - March 8, 2019 / 03:08 AM IST

పంజాబ్‌లో అద్బుతం జరిగింది. 118 ఏళ్ల బామ్మకు వైద్యులు గుండె ఆపరేషన్ నిర్వహించారు. ఇంత వయస్సున్న వారికి ఆపరేషన్ చేయడం గొప్ప విషయమని భావించి గిన్నీస్ బుక్ రికార్డ్స్‌కి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ వారికి రిఫర్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. చికిత్స సక్సెస్ అయ్యిందని..ప్రస్తుతం బామ్మ బాగానే మాట్లాడుతోందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇది పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో చోటు చేసుకుంది. 
Also Read : Sky for ALL : @ 799లకే విమాన టికెట్

లుథియానాలో ఉంటున్న కర్తార్ కౌర్ 1901లో జన్మించారు. ఈమెకు 118 సంవత్సరాలు. వంశంలోని ఐదు తరాలను చూసింది. ఈమెకు 90 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే గుండెకు సంబంధించిన వ్యాధితో ఈమె లుథియానాలోని అపోలో హాస్పిటల్‌లో ఫిబ్రవరి 24వ తేదీన అడ్మిట్ అయ్యింది. పేస్ మేకర్‌ అమర్చాల్సి ఉంటుందని వైద్యులు నిర్దారించారు. అయితే ఈమె వయస్సు అడ్డంకిగా ఉంటుందని డాక్టర్స్ ఆలోచించారు. చివరకు పేస్ మేకర్‌ని విజయవంతంగా అమర్చారు. ఈ వయస్సులో ఆపరేషన్ చేయడం పెద్ద ఛాలెంజ్ అని వైద్యులు వెల్లడించారు. 

పేస్ మేకర్స్ అంటే : 
గుండె కొట్టుకోవడానికి ఏర్పాటు చేసే కృతిమ పరికరం అంటారు. సుమారు 25 నుండి 35 గ్రాముల బరువు ఉంటుంది. దీనిని అమర్చడం వల్ల గుండె కండరాలను ఉత్తేజ పరుస్తుంది. సాధారణ గుండె స్పందనలను తెలియచేసే సామర్థ్యం ఉంటుంది. అయితే పేస్ మేకర్ అమర్చిన వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2

ట్రెండింగ్ వార్తలు