Does adding broccoli to daily diet prevent chronic diseases?
Broccoli : బ్రోకలీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీలో విటమిన్లు సి, కె, ఎ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్‌కు మంచి మూలం. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు, ఆరోగ్యకరమైన ఎముకలు, చర్మానికి, జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడతాయి.
బ్రకోలీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కూరగాయలలో ఫ్లేవనాయిడ్స్, సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనాలు ఉన్నాయి. అంతేకాకుండా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడంలో ఈ సమ్మేళనాలు సహాయపడతాయి.
బ్రోకలీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియ, కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదించేలా చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటంలో ఉపయోగపడుతుందని అధ్యయనాల్లో సైతం తేలింది.
బ్రోకలీ బరువు తగ్గాలనే ప్రయత్నాల్లో ఉన్నవారికి ఇది మంచి ఆహారమని నిపుణులు చెబుతున్నారు. తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉన్నందున బ్రోకలీ కడుపు నిండుగా, ఉంచడంలో సహాయపడుతుంది. ఇది రోజంతా మీరు తినే కేలరీల సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
బ్రోకలీలో ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. దీనిని ఆహారంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్యలు కూడా దూరమవుతాయి. బ్రొకోలీలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఈ క్యాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి, ఎముకలు ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది.
శరీరానికి అవసరం అయ్యే ఎంజైములకు రక్షణ కల్పిస్తుంది మరియు శరీరంలో క్యాన్సర్ కు కారణం అయ్యే కెమికల్స్ ను శరీరం నుండి బయటకు నెట్టివేస్తుంది. క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేయడంలో ఒక ఉత్తమ ఆహారం బ్రొకోలీ.
బ్రొకోలీలో విటమిన్ సి, విటమిన్ కె మరియు ఒమేగా ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. మెదడు యొక్క పనితీరును మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతాయి. జ్ఝాపక శక్తిని కూడా పెంచుతాయి.
మొత్తంగా చెప్పాలంటే బ్రోకలిని రోజువారి ఆహారంలో తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. దీని ఖరీదు ఎక్కువైనప్పటికీ శరీరానికి కావాల్సిన పోషకాలకోసం దీనిని తీసుకోవటం అవసరం.