Barley Water : బార్లీ నీటితో శరీరంలో వ్యర్ధాలు బయటకు పోతాయా?..

బార్లీలో ఉండే బీటా గ్రూకాన్ విసర్జనక్రియలో శరీరంలోని విషపదార్ధాలను బయటకు పంపుతుంది. హెమోరాయిడ్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Barlly Water

Barley Water : ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వాటితో ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అలాంటి వాటిలో బార్లీ చాలా ముఖ్యమైనది. చూడటానికి గోధుమ గింజల్లాగే బార్లి గింజలు ఉంటాయి. అయితే గోధుమ గింజలకంటే బార్లీ గింజల వల్ల మనిషి శరీరానికి అధిక ప్రయోజనాలు కలుగుతాయంటే నమ్మితీరాల్సిందే. బార్లీ గింజలు నీటిలో మరిగించి నిమ్మరసం, తేనె కలిసి తీసుకోవచ్చు. ఇలా తరచూ తీసుకుంటే అనేక సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చు.

బార్లీ నీటిని తాగటం వల్ల శరీరంలోని విష,వ్యర్ధ పదార్ధాలన్నీ యూరిన్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. పెద్ద పేగును శుభ్రపరుస్తుంది. అధిక వేడితో బాధపడుతున్న వారు బార్లీ నీరు తాగటం వల్ల వేడి తగ్గుతుంది. కడుపులో మంట, అజీర్తి, గ్యాస్ తో బాధపడే వారికి బార్లీ నీరు బాగా ఉపయోగకారిగా పనిచేస్తాయి. షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు తరచూ బార్లీ నీరు తీసుకోవటం వల్ల చక్కెర స్ధాయిలు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

బార్లీలో ఉండే బీటా గ్రూకాన్ విసర్జనక్రియలో శరీరంలోని విషపదార్ధాలను బయటకు పంపుతుంది. హెమోరాయిడ్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెద్ద పెగు క్యాన్సర్ తోపాటు, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసే శక్తి బార్లీ నీటిలో ఉంది. స్పైసీ ఆహారం తీసుకున్న సమయంలో కడుపులో విపరీతమైన మంటవస్తుంది. ఇలాంటి సందర్భాల్లో బార్లీ నీటిని తీసుకోవటం వల్ల ఉపశాంతి కలుగుతుంది.

బార్లీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల ఈనీటిని తాగటం వ్లల కీళ్ళ నొప్పుల వంటి సమస్యలు తగ్గిపోతాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ స్ధాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అధిక రక్తపోటు స్ధాయిలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్రీలు రక్తపోటును అదుపులో ఉంచేందుకు బార్లీనిటిని సేవిస్తారు. పాదాలవాపు, మహిళల్లో వచ్చే మూత్ర సమస్యలకు బార్లీనీరు చెక్ పెడుతుంది.

మూత్రపిండాల్లో రాళ్ళతో బాధపడుతున్న వారు బార్లీ నీరు తాగటం వల్ల రాళ్ళు కరిగి బయటకు వెళ్ళిపోయేలా చేస్తుంది. పాలిచ్చే తల్లులు రోజుకు ఒక కప్పు బార్లీ నీరు తాగటం వల్ల పాలు ఎక్కవగా తయారవ్వటంతోపాటు, బిడ్డ జీర్ణ వ్యవస్ధకు దోహదం చేస్తాయి.