Daily Bathing :
Daily Bathing : క్రమబద్ధమైన జీవితం, క్రమశిక్షణతో కూడిన అలవాట్లు జీవితం సాఫీగా సాగటానికి తోడ్పడతాయి. ముఖ్యంగా శరీరానికి సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకుంటే అందం, ఆరోగ్యం రెండు సొంతమౌతాయి. నిజానికి సన్నానం చేయటం వల్ల శరీరం శుభ్రపడుతుంది. స్నానంతో ఇతర లాభాలు ఉన్న విషయం చాలా మందికి అవగాహన ఉండదు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
చలికాలంలో వేడినీళ్లతో స్నానం చేయటం వల్ల జలుబును దూరంగా ఉంచవచ్చు. వేడినీటి ప్రభావం నాసికా రంధ్రాల ద్వారా లోపలకు చేరి ముక్కలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఒంటి నొప్పులతో బాధపడేవారు వేడినీటితో స్నానం చేయటం వల్ల ఒంటినొప్పులు తొలగిపోతాయి. శరీరం రిలాక్స్ గా ఉంటుంది. తద్వారా మెదడులో ఏదైనా బాధ ఉంటే తొలగిపోతుంది.
స్నానం చేయటం వల్ల నిద్రబాగా పడుతుంది. నీరు శరీర ఉష్ణోగ్రతపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా వేడినీటితో స్నానం చేయబటం వల్ల శరీర ఉష్ణోగ్రత పై పొరలలో పెరుగుతుంది. తర్వాత క్రమే తగ్గుతుంది. దీంతో మెలటోనిన్ ఉత్పత్తి జరిగి మెదడు ప్రశాంతంగా ఉండి నిద్రబాగా పడుతుంది.
క్రమం తప్పకుండా స్నానం చేయటం వల్ల మెదడు చురుకు దనంగా ఉంటుంది. ఒత్తిడి దూరం అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చర్మంపై మృతకణాలు కణాలు చేరడం వల్ల కలిగే చికాకు, మంట, పుండ్లను నివారించడంలో స్నానం బాగా సహాయపడుతుంది.
చన్నీటి స్నానం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు ఒక క్రమపద్ధతిలో రక్తప్రసరణ జరుగుతుంది. దీనివల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఉంటాయి. అలాగే ధమనుల్లో కూడా రక్తప్రసరణ బాగా జరిగి గుండెను సురక్షితంగా ఉంటుంది.
స్నానం వల్ల బీపీ అదుపులో ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరంపైబాగంలోని మలినాలు, విషపదార్థాలు సులభంగా తొలగిపోతాయి. వ్యాయామాలు చేసిన తరువాత స్నానం చేయటం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. స్నానం విషయంలో చన్నీళ్లు, వేడి నీళ్లు ఆరోగ్య పరంగా వేటి ప్రయోజనాలు వాటికున్నాయి.