Honey Milk
Reduce Stress : వేడి పాలలో తేనె కలిపి తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతోపాటు నాడీ కణాల సమస్యలుంటే.. అవి దూరమై.. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. మంచిగా నిద్రపోవడానికి వెచ్చని పాలలో తేనె కలిపి తాగడం వల్ల మంచిగా నిద్రపడుతుంది. నిద్రపోవడానికి ఒక గంట ముందు వెచ్చని పాలలో తేనె కలిపి తాగాలి.
జీర్ణక్రియను మెరుగుపడటానికి వేడిపాలలో క్రమం తప్పకుండా తేనె కలిపి తాగాలి. ఇది మలబద్దకాన్ని దూరం చేస్తుంది. ఎముకలు బలంగా తయారుకావడానికి వేడిపాలలో హనీ కలిపి తాగితే ప్రయోజనం. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల సమస్యలు దూరమవుతాయి. పాలలో తేనెను కలిపి క్రమం తప్పకుండా తాగడం వల్ల శారీరక.. మానసిక మానసిక సమస్యలు దూరమై రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది మహిళలు తల్లి కాలేకపోతున్నామే అని బాధపడుతుంటారు అలాంటి వారు ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక టీస్పూన్ తేనె చేర్చుకుని తీసుకుంటే పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. స్పెర్మ్‌ల సంఖ్య రెట్టింపవుతుంది.
వేడిపాలల్లో తేనె కలుపుకుని తాగటం వల్ల నాడీ వ్యవస్ధ, కణాలు రిలాక్స్ అవుతాయి. తద్వారా ఒత్తిడి దూరమౌతుంది. మానసిక ప్రశాంతతకు ఇవి బాగా ఉపకరిస్తాయి. పాలు, తేనెలో అనేక ఔషదగుణాలు కలిగి ఉన్నట్లు ఇప్పటికే నిరూపితమైందిగుండెజబ్బులతో బాధపడుతున్న 70మందిపై జరిపిన పరిశోధనలో ఆశాజనకమైన ఫలితాలను వైద్యులు నమోదు చేయగలిగారు. మూడు రోజుల పాటు రోజు రాత్రి సమయంలో పాలు, తేనె కలిపిన పాలను వారికి అందించగా ప్రశాంతంగా నిద్రించినట్లు గుర్తించారు.
నిద్రకు అరగంట ముందు తేనె, పాలు కలగలిసిన మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, పిల్లల్లో దగ్గు తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఎముకల ఆరోగ్యానికి ఈ రెండింటి కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా పాలు, తేనె కలిపి తీసుకోవటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్ధాయి పెరుగుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
రక్తపోటు స్ధాయి నియంత్రణలో ఉంచటంలో పాలు, తేనెల మిశ్రమం దోహదపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్ధాయిల తగ్గించగలుగుతుంది. తద్వారా గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది. ఇదిలా ఉంటే తేనె, పాలు కలిపి తీసుకోవటం వల్ల కొన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయి. తేనెలో చక్కెర , కెలరీలు అధికంగా ఉండటం వల్ల అధిక బరువుకు దారితీస్తుంది. తద్వారా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. తేనెను అధిక డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయటం వల్ల హైడ్రాక్సీమీథైల్ఫర్ ఫ్యూరల్ ఏర్పడుతుంది. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది.