Eating Fast : ఆహారాన్ని వేగంగా తినటం వల్ల బరువు పెరుగుతారా ?

ఊబకాయం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆరోగ్య సమస్యలలో ఒకటి. వాస్తవానికి దీనికి పర్యావరణ, జీవనశైలి కారకాలు కారణంగా చెప్పవచ్చు. వేగంగా తినడం అధిక బరువు ,ఊబకాయం ప్రమాదలకు కారకంగా అధ్యయనంలో కనుగొనబడింది.

Eating too fast

Eating Fast : చాలా మంది తాము రోజువారి తీసుకునే ఆహారాన్ని వేగంగా తినేస్తుంటారు. అయితే ఇలా వేగంగా ఆహారం తీసుకోవటం అన్నది చెడ్డ అలవాటని నిపుణులు చెబుతున్నారు. అతిగా తినటంతోపాటు, తినే ఆహారాన్ని స్పీడ్ గా తినటం వల్ల బరువు పెరగటంతోపాటు, ఊబకాయనికి దారితేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

READ ALSO : Supreme Court : సుప్రీంకోర్టులో వనమాకు ఊరట.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే

నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బిజీగా మారిపోయారు. కంప్యూటర్లపనితో తినడానికి తగినంత సమయం లేకపోవటంతో తినే ఆహారాన్ని కనీసం ఆస్వాదించేందుకు అవకాశం లేకుండా పోయింది. నెమ్మదిగా తినడం నిజానికి పరిపూర్ణమైనదిగా ఉంటుంది. కొందరిలో ఊబకాయం అన్నది ప్లేట్‌లో ఉన్న ఆహారాలను తినటంవల్ల కాక వేగంగా తినటం వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి.

నేటి బిజీ లైఫ్ లో చాలా మంది తాము రోజువారిగా తీసుకునే ఆహారాన్ని ఆతురుతలో తింటారు. మనం తినే ఆహారానికి సంబంధించి మెదడుకు సంపూర్ణత యొక్క సంకేతాలను ప్రాసెస్ చేయడానికి సమయం కావాల్సి ఉంటుంది. వాస్తవానికి కడుపు నిండుగా ఉందని మీ మెదడు గ్రహించడానికి 20 నిమిషాల వరకు పట్టే అవకాశం ఉంటుంది. వేగంగా తినేటప్పుడు శరీరానికి నిజంగా అవసరమైన దానికంటే చాలా ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. కాలక్రమేణా, అధిక కేలరీల తీసుకోవడం బరువు పెరగడానికి దారితీస్తుంది.

READ ALSO : Hot Water : పొట్ట శుభ్రతకు, బరువు తగ్గేందుకు.. గోరు వెచ్చని నీరు ఎంతో మేలు

పిల్లలపై జరిపిన ఒక అధ్యయనంలో వేగంగా తినే వారిలో 60% మంది పిల్లలు మోతాదుకు మించి అతిగా తింటారని తేలింది. వేగంగా తినేవారిలో అధిక బరువు పెరిగే అవకాశం 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది ఊబకాయం పెరిగే ప్రమాదంతో ముడిపడి ఉంది.

ఊబకాయం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆరోగ్య సమస్యలలో ఒకటి. వాస్తవానికి దీనికి పర్యావరణ, జీవనశైలి కారకాలు కారణంగా చెప్పవచ్చు. వేగంగా తినడం అధిక బరువు ,ఊబకాయం ప్రమాదలకు కారకంగా అధ్యయనంలో కనుగొనబడింది. నెమ్మదిగా తినేవారితో పోలిస్తే, వేగంగా తినేవారికి ఊబకాయం వచ్చే అవకాశం దాదాపు రెండు రెట్లు ఎక్కువ అని పరిశోధనలో కనుగొన్నారు.

READ ALSO : Weight loss tip : వీటిని వాసన చూస్తేనే బరువు తగ్గుతారట

వేగంగా తినడం అన్నది ఇన్సులిన్ నిరోధకత ప్రమాదంతో ముడిపడి ఉంటుంది. ఇది అధిక రక్తంలో చక్కెర , ఇన్సులిన్ స్థాయిల ద్వారా వర్గీకరించబడుతుంది. టైప్ 2 డయాబెటిస్ మరియు మెటబాలిక్ సిండ్రోమ్ యొక్క ముఖ్య లక్షణం. వేగంగా తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నెమ్మదిగా తినే వారితో పోలిస్తే వేగంగా తినేవారికి వ్యాధి వచ్చే అవకాశం 2.5 రెట్లు ఎక్కువ అని ఒక అధ్యయనంలో తేలింది.

వేగవంతంగా ఆహారం తీసుకోవటం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మధుమేహం , గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే ప్రమాద కారకాలకు కారణమవుతుంది. దీని వల్ల జీర్ణక్రియ సవ్యంగా జరగదు. ఆహారాన్ని తినేసమయంలో నిదానంగా ఎక్కువ సమయం నములుతూ తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల జీర్ణక్రియను సవ్యంగా ఉంటుంది.

 

 

ట్రెండింగ్ వార్తలు