Blood Flow : శనగలు తింటే శరీరంలో రక్తం పెరుగుతుందా…

వీటిల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అలాగే విటమిన్ కె వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి.

Chik Peas

Blood Flow : ఎన్నో పోషకాలు, పీచుపదార్థాలు, విటమిన్స్ కలిగిన శనగలను తినటం వల్ల ఎన్నో లాభాలు పొందొచ్చు. శనగలు తినడం కారణంగా మనకు అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు ఎప్పట్నుంచో చెబుతున్నారు. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉండి, ప్రోటీన్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్‌గా శనగలు తినడం వల్ల మాంసాహారులు పొందే అనేక లాభాలన్నీ పొందొచ్చు. ఫిట్నెస్ ఇష్టపడేవారికి సరైన ఆహారమని చెప్పుకోవచ్చు. 100 గ్రాముల ఉడికించిన శనగలలో 9 గ్రాముల ప్రొటీన్, 8 గ్రాముల ఆహార ఫైబర్ ఉంటుంది. యునైటడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నివేదికల ప్రకారం కొలెస్ట్రాల్ అసలు ఉండదు. శాకాహారులకు ప్రోటీన్ కోసం ప్రతిరోజు శనిగలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా అనీమియా సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు.. వీటిని తీసుకుంటే ఐరన్ ఎక్కువగా లభించడం కారణంగా మన శరీరంలో హిమోగ్లోబిన్ అభివృద్ధి చెందుతుంది.

వీటిల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అలాగే విటమిన్ కె వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అన్ని పోషకాలు శరీరంలో ఎముకలు బలంగా ఉండటానికి అవసరం. కాల్షియం లేమితో బాధపడేవారు శనగలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. శనగలు తినటం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడవచ్చు. వీటిని తినడం వల్ల కొవ్వు శాతం పెరగదు.శనగల్లో ఉండే విటమిన్ బి9 లేదా ఫోలేట్ మెదడు, కండరాల సరైన అభివృద్ధికి అలాగే నాడీవ్యవస్థ చక్కగా పనిచేయటానికి, సరైన మెటబాలిజం వంటివాటికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన గుండె, మెదడు ఇంకా శరీరం కోసం శనగలను తీసుకోవటం ఉత్తమం.

శనగల్లోని పీచుపదార్థం రక్తంలోని చక్కెరస్థాయిని, కొవ్వుల స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను కూడా మెరుగ్గా నియంత్రించటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎక్కువ పీచుపదార్థాలు ఉన్న ఆహారం వల్ల డయాబెటిస్,రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం వంటి రిస్కులు తగ్గుతాయి. కాబట్టి డయాబెటీస్ వీటిని ఎక్కువగా తింటే చాలా మంచిది. అజీర్ణ సమస్యలకు శనగలతో చెక్ చెప్పవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా అజీర్ణ సమస్యలను శాశ్వతంగా దూరం చేయవచ్చు. వీటిలో ఉండే పోషకాలు ఆకలి కాకుండా చూస్తాయి. తద్వారా మనకు ఎనర్జీ లభించి నీరసం వంటి సమస్యలు దరి చేరవు. మనం శనగలను ప్రతి నిత్యం తీసుకోవడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.

బ్లడ్ ప్రెజర్‌ను అదుపుచేసే శక్తి శనగలకు ఎక్కువగా ఉంటుంది. పొటాషియం ఇందులో ఎక్కువగా ఉంటుంది కనుక హై బ్లడ్ ప్రెజర్‌కు ఇది చక్కని ఔషధంలా పనిచేస్తుంది. ఒక కప్పు శనగల్లో 474 ఎంజీల పొటాషియం ఉంటుంది. రోజూ 4,700 ఎంజీల పొటాషియం క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.  క్రమం తప్పకుండా ఉదయం ఒక కప్పు శనగలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.