Akrots
Walnuts : నట్స్ తినటం ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. చిన్నపాటి మెదడు ఆకారంలో ఉండే అక్రోట్ల వంటి నట్స్ లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అందులోను అక్రోట్ల వంటి నట్స్ తినటం వల్ల ఆయుర్ధాయం పెరుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. పోషక విలువలు సమవృద్ధిగా దొరికే అక్రోట్లు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయని హార్వర్డ్ యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. అక్రోట్లు తింటే వృద్ధుల్లో ఆయుర్ధాయం పెరుగుతుందని పరిశోధకులు తేల్చారు.
వారంలో ఐదురోజుల పాటు రోజుకు 28 గ్రాముల చొప్పున అక్రోట్లు తింటే మరణాల ముప్పు 18శాతం, గుండె జబ్బులు 25శాతం తగ్గుతాయట. ఇవి తినేవారిలో జీవితకాలం ఒక సంవత్సరం అదనంగా పెరిగినట్లు పరిశోధకులు తేల్చారు. పరిశోదనకు సంబంధించిన వివరాలను జర్నల్ న్యూట్రింట్స్ లో ప్రచురితమయ్యాయి.
వాలనట్స్ లో ప్రొటీన్స్,ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, మెగ్నీషియమ్, థీయమిన్,రిబోఫ్లోవిన్,పోటాషియం,విటమిన్, బి6, బి12, విటమిన్ ఎ,సి,ఇ,కె లతో పాటు అనేక పోషకాలు లభిస్తాయి. సుమారు 30గ్రాముల అక్రోట్ల నుండి 190 క్యాలరీలు లభిస్తాయి. ఎవరైనా తమ అహారంలో బాగంగా తినొచ్చు. పోషక విలువలు ఎక్కవగా ఉంటే అక్రోట్లు అనేక రోగాలను నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించటంతోపాటు, మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
క్యాన్సర్ కణాల పెరుగుదలను సైతం అక్రోట్లు అడ్డుకుంటాయి. నిద్రబాగా పట్టటంతోపాటు, ఎముక సాంద్రత పెంచేందుకు ఉపయోగపడతాయి. మూర్చ వంటి నాడీ సంబంధిత సమయ్యలతో బాధపడేవారికి ఇందులో ఉండే మాంగనీస్ బాగా పనిచేస్తుంది. చిన్నారుల మెదడు శక్తి పెంపుదలకు ఎంతో ఉపకరిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించటంలో ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి.
అక్రట్లను నిత్యం తీసుకోవటం వల్ల రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచే మంచి కొవ్వుల పరిమాణాన్ని అక్రోట్లు తినటం వల్ల పెరుగుతాయి. ఇందులో ఫ్యాట్ ఎక్కవగా ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో కొవ్వులు ఆరోగ్యానికి మేలుచేస్తాయంటున్నారు. కంటి చూపుకు అక్రోట్లు బాగా పనిచేస్తాయి.