White Hair : చిన్నవయస్సులో జుట్టు తెల్లబడుతుందా…. అయితే ఏంచేయాలో తెలుసా!

బాల్యం, యవ్వనంలో ఈ సమస్య ఎదురైతే ఆహార నియమాలతో బాలనెరపు సమస్యను తొలగించుకోవచ్చు. జన్యుపరమైన కారణాల వల్ల, ఏవైనా ఆరోగ్య సమస్యల వల్ల విట

Whit Hair

White Hair : మధ్య వయసు దాటారని తెలుసుకునేందుకు తలపై తెల్లజుట్టు సంకేతంగా చెప్పవచ్చు. పెద్ద వయస్సు వారిలో వెంట్రుకలు నెరవడం సర్వసాధారణం. అయితే అతిచిన్న వయస్సులోనే చాలా మంది బాలబాలికల్లో జుట్టు తెల్లబడిపోతుంటుంది.

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడాన్ని ప్రీమెచ్యూర్‌ గ్రేయింగ్‌ బాలనెరుపు అంటారు. చిన్న తనంలోనే జుటు తెల్లబడడం వల్ల ఆరోగ్యానికి ఏలాంటి సమస్య ఉండదు. చర్మ సమస్యల కారణంగా జుట్టు కూడా బలహీనపడి కాంతిని కోల్పోతుంది. పెద్ద వయస్సువారిలో మెలనిన్ ఉత్పత్తి ఆగిపోయి జుట్టు తెల్లబడుతుంది. తిరిగి నల్లగా మార్చటం సాధ్యం కాదు.

బాల్యం, యవ్వనంలో ఈ సమస్య ఎదురైతే ఆహార నియమాలతో బాలనెరపు సమస్యను తొలగించుకోవచ్చు. జన్యుపరమైన కారణాల వల్ల, ఏవైనా ఆరోగ్య సమస్యల వల్ల విటమిన్‌ బి 12, ఐరన్‌ లోపం, వత్తిడి, ఆందోళన, జుట్టుకు వాడే షాంపూలు పడకపోవడం, ఇలా వివిధ కారణాల వల్ల బాలనెరుపు వచ్చే అవకాశం ఉంది.

కొన్ని ఆహార నియమాలను పాటిస్తే చిన్న వయస్సులో వచ్చే తెల్లజుట్టు సమస్యలను నిరోధించవచ్చు. ఆహారంలో బి 12 అధికంగా ఉండే పాలు, పెరుగు, మాంసం, గుడ్లు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ లభించే ఆకుకూరలు, అన్ని రకాల ఖనిజాలు పుష్కలంగా అందేలా గింజలను తినాలి. మాంసకృత్తులని మాంసం రూపంలో లేదా గుడ్లు లేదా పప్పుధాన్యాల రూపంలో తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలితో కొంత వరకు ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.