Sugar
Sugar : వయస్సు పెరుగుతుంటే చాలా మందిలో శృంగార సామర్ధ్యం తగ్గటం సహజంగానే జరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. పొగతాగటం, మద్యం తాగే అలవాటు, పర్యావరణ విషతుల్యాలు, దీర్ఘకాలిక ఒత్తిడి శృంగారంలో ఆసక్తి తగ్గేలా చేస్తాయి. వీటితో పాటు మరో కారణం కూడా శృంగారం పై ఆసక్తి తగ్గేందుకు కారణంగా చెప్పవచ్చు. అదే చక్కెర.. చక్కెర రక్తంలో ఇన్సులిన్ స్ధాయిలపై తీవ్రప్రభావం చూపుతుంది. శరీరంలో ఇన్సులిన్ స్ధాయిలను పెంచి హార్మోన్ల సమతుల్యతకు విఘాతం కలిగిస్తుంది. ఫలితంగా శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
చక్కెర అధికంగా ఉండే పిండి పదార్ధాలను తీసుకుంటే రక్తంలో ఇన్సులిన్ స్ధాయిలు పెరుగుతాయి. ఇది క్రమేపీ ఇంన్సులిన్ నిరోధకతకు దారితీసి, శృంగారంపై ఆసక్తి కలుగజేసే టెస్టోస్టిరాన్ స్ధాయిలు తగ్గేలా చేస్తాయి. టెస్టోస్టిరాన్ తగ్గితే కండరాల మోతాదు తగ్గుతుంది. కడుపులో కొవ్వు పెరుగుతుంది. శరీరంలో కొవ్వు స్ధాయిలు పెరిగితే ఈస్ట్రోజన్ హార్మోన్ మోతాదు పెరుగుతాయి. దీని ప్రభావం వల్ల లైంగిక వాంఛలు తగ్గుతాయి. శుద్ధి చేసిన పదార్ధాలు, పిండి పదార్ధాలు, చక్కెరను ఎక్కువగా తినటం వల్ల టెష్టిన్ హార్మోన్ పనిచేయటం మానేస్తుంది. కొవ్వు కణాలు టెష్టిన్ ఉత్పత్తి చేయటం కొనసాగిస్తున్నప్పటికీ మెదడు కంట్రోల్ తప్పుతుంది. టెస్టోష్టిరాన్ హార్మోన్ స్ధాయిలూ తగ్గుతాయి.
పిండి పదార్ధాలు, చక్కెర వంటివి రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలను చాలా వేగంగా పెంచుతాయి. దీంతో ఇన్సులిన్ వెంటనే రంగంలోకి దిగి దాన్ని దగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇన్సులిన్ అవసరమైన దానికన్నా మరింత ఎక్కువగానూ రక్తంలో గ్లూకోజ్ ను తగ్గిస్తుంది. ఇది త్వరగా ఆకలి వేయటానికి, నిస్సత్తువకు దారి తీస్తుంది. అంతేకాదు మన ఆహారం, అలవాట్లను , చురుకుదనాన్ని నియంత్రించే హార్మోన్ పనితీరును చక్కెర దెబ్బతీస్తుంది. ఫలితంగా అలసట, నిస్సత్తువ కలుగుతాయి. ఇవి శృంగారంపై ఆసక్తిని తగ్గిస్తాయి.