Vitamin D Deficiency : విటమిన్ డి లోపంతో గుండెజబ్బులు వస్తాయా ?

డయాబెటిస్ విషయంలో కూడా విటమిన్ డి పాత్ర ఉంది. గ్లూకోజ్ మెటబాలిజమ్ కి, ఇన్సులిన్ సక్రమంగా పనిచేయడానికి కూడా విటమిన్ డి తోడ్పడుతుంది. విటమిన్ డి లోపం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి, గ్లూకోజ్ మేనేజ్ మెంట్ కూడా కష్టం అవుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ల పై కూడా విటమిన్ డి లెవల్స్ ప్రభావం ఉంటుంది.

vitamin D deficiency

Vitamin D Deficiency : మనం ప్రకృతికి ఎంత దూరంగా వెళుతుంటే.. అనారోగ్యాలకు అంత దగ్గరగా వెళతాం. ఇందుకు మంచి ఉదాహరణ విటమిన్ డి లోపం. ఎత్తయిన అపార్ట్ మెంట్ ఫ్లాట్లలో ఎండ తగలకుండా తలుపులు మూసుకుని ఉండే కల్చర్ తో పాటు విటమిన్ డి లోపం కూడా పెరిగిపోతున్నది.

విటమిన్ డి తక్కువైతే కాల్షియం తక్కువవుతుందనీ, ఇమ్యూనిటీ తగ్గుతుందనీ మనకు తెలుసు. కానీ దీని లోపం ఒకవైపు రక్తంలో పీడనాన్నీ, గుండెజబ్బుల రిస్కునూ కూడా పెంచుతుందని ఇటీవలి అధ్యయనంలో తేలింది.

READ ALSO : Laughter Benefits : బీపీని దూరం చేయటంతో పాటు, గుండె ఆరోగ్యానికి మేలు చేసే నవ్వు !

ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు.. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కూడా డి విటమిన్ తగినంత తీసుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు. సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ డి కి సంబంధించిన ఈ అధ్యయనం యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురితమైంది.

విటమిన్ డి లోపం వల్ల రక్తపోటు పెరిగి, గుండె, రక్తనాళాల వ్యాధుల రిస్కు పెరుగుతుంది. అందుకే ఒక వ్యక్తిలో డి విటమిన్ స్థాయిలను బట్టి కార్డియోవాస్కులర్ రిస్కు ఏ మేరకు ఉందో అంచనా వేయవచ్చని సౌత్ ఆస్ట్రేలియా క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు చెప్తున్నారు.

రెనిన్ ఆంజియోటెన్సిన్ఆల్డోస్టిరాన్ జీవరసాయన చర్యలు రక్తపోటును రెగ్యులేట్ చేస్తాయి. ఈ జీవరసాయన చర్యల మార్గాన్ని విటమిన్ డి ప్రభావితం చేస్తుంది. తగినంత విటమిన్ డి ఉంటే ఈ జీవరసాయన చర్యలు సక్రమంగా జరిగి సాధారణ రక్తపోటు మెయిన్ టెయిన్ అవుతుందని గురుగ్రామ్ లోని మణిపాల్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దీక్షిత్ గార్గ్ కూడా అంటున్నారు.

READ ALSO : United States : రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ప్రముఖ సింగర్.. అంత కష్టం ఏం వచ్చింది?

విటమిన్ డి.. ఎందుకు?

మన శరీరానికి కావాల్సిన పోషకాల్లో తక్కువ మోతాదులో అవసరమైన మైక్రో న్యూట్రియెంట్స్ విటమిన్లు. కొవ్వులో కరికే డి విటమిన్ డి2, డి3 అని రెండు రకాలుగా ఉంటుంది. ఇది ప్రధానంగా సూర్యరశ్మి నుంచి వచ్చినా కొన్ని రకాల ఆహార పదార్థాల్లో కూడా దొరుకుతుంది. దంతాలు, ఎముకల పెరుగుదలకు, అవి బలంగా ఉండటానికి విటమిన్ డి తప్పనిసరి. వీటి ఎదుగుదలకు తోడ్పడే కాల్షియం శరీరానికి ఉపయోగపడాలంటేనే విటమిన్ డి అవసరం అవుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ శక్తిమంతంగా పనిచేయడానికి కూడా విటమిన్ డి తోడ్పడుతుంది. ఇది తగినంత లేనప్పుడు సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాల్సి వస్తుంది.

READ ALSO : Ram Charan : రామ్ చరణ్ కూడా మనలాగానే.. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఆ పని చేస్తాడంటా.. అదేంటో తెలుసా..?

అధ్యయనం ఏం చెబుతుందంటే….

అరవయ్యేళ్లకు పైన వయసున్న వాళ్లు, విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకునేవాళ్లలోగుండెపోట్లు వచ్చే ప్రమాదం 9 శాతం తక్కువగానూ, హార్ట్ ఎటాక్ రేటు 19 శాతం తక్కువగానూ, కరొనరీ వాస్కులరైజేషన్ (గుండె, రక్తనాళాలకు సంబంధించిన చికిత్సలు) రేటు 11 శాతం తక్కువగానూ ఉన్నట్టు ఈ అధ్యయనంలో స్పష్టమైంది. స్ట్రోక్ విషయంలో మాత్రం విటమిన్ డి ప్రభావం పెద్దగా కనిపించలేదు.

విటమిన్ డి వర్సెస్ హార్ట్

ఇన్ ఫ్లమేషన్ ను నిరోధించే లక్షణం విటమిన్ డి కి ఉంటుంది. కార్డియోవాస్కులర్ సిస్టమ్ (గుండె, రక్తనాళాల వ్యవస్థ) అంతటా కూడా విటమిన్ డి రీసెప్టార్లు ఉంటాయి. ఇవి విటమిన్ డి ని చైతన్యవంతం చేస్తాయి. ఇలా యాక్టివ్ అయిన డి విటమిన్ రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. ఇన్ ఫ్లమేషన్ ని నివారిస్తుంది. అందుకే విటమిన్ డి లోపానికీ, గుండెజబ్బులకు సంబంధం ఉన్నట్టు భావిస్తున్నారు సైంటిస్టులు.

READ ALSO : Short people live longer : పొడవుగా ఉన్నవారి కంటే పొట్టిగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారట

విటమిన్ డి సప్లిమెంట్లను అయిదేళ్లుగాతీసుకుంటున్నవాళ్లలో గుండె లయకు సంబంధించిన సమస్యలు, ఏట్రియల్ఫిబ్రిలేషన్ రిస్కు కూడా తగ్గినట్టు ఈస్టర్న్ ఫిన్ లాండ్ యూనివర్సిటీ అధ్యయనం కూడా తేల్చింది.

డయాబెటిస్ నివారణలో..

డయాబెటిస్ విషయంలో కూడా విటమిన్ డి పాత్ర ఉంది. గ్లూకోజ్ మెటబాలిజమ్ కి, ఇన్సులిన్ సక్రమంగా పనిచేయడానికి కూడా విటమిన్ డి తోడ్పడుతుంది. విటమిన్ డి లోపం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి, గ్లూకోజ్ మేనేజ్ మెంట్ కూడా కష్టం అవుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ల పై కూడా విటమిన్ డి లెవల్స్ ప్రభావం ఉంటుంది.

READ ALSO : Strange Customs : శ్రావణమాసంలో మహిళలు దుస్తులు ధరించని ఆచారం .. భర్తను కూడా కన్నెత్తి చూడరు

అందుకే సప్లిమెంట్లు

మన శరీరంలో మెటబాలిక్ యాక్టివిటీలకు విటమిన్ డి కావాలి. ఎండ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండేవాళ్లు, ఎక్కువగా వర్షం, మబ్బులు పట్టి ఉండే వాతావరణంలో నివసించేవాళ్లలో విటమిన్ డి లోపించే అవకాశం ఎక్కువ. మన దేశంలో ఎండకు కొదవ లేకపోయినా ఆధునిక జీవనశైలి మనల్ని సూర్యుడికి దూరం చేస్తోంది. గాలి, వెలుతురు సరిగా రాని అపార్ట్ మెంట్ల నివాసం, ఎక్కడికి వెళ్లినా ఎయిర్ కండిషన్డ్ గదులు ఎండ తగలనీయడం లేదు. దాంతో మన ఇండియన్స్ లో కూడా విటమిన్ డి లోపం ఎక్కువ అవుతున్నది. అందువల్ల సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాల్సి వస్తున్నది. అయితే డాక్టర్ సలహా లేకుండా విటమిన్ డి వాడితే ఓవర్ డోస్ అయిపోయి, హానికరం అయ్యే ప్రమాదం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు