Laughter Benefits : బీపీని దూరం చేయటంతో పాటు, గుండె ఆరోగ్యానికి మేలు చేసే నవ్వు !

ప్రశాంతమైన చిరునవ్వు ఆరోగ్యాన్నే కాదు అనుబంధాలను కూడా మెరుగుపరుస్తుంది. కానీ మనసులో రాగద్వేషాలు పెంచుకుని, అనుబంధాలను తెంచుకుని బతికేస్తున్నాం. ఎప్పుడూ ముఖం మాడ్చుకుని ఉండేవాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. ఇలాంటి వాళ్లలో గుండెజబ్బులు వచ్చే అవకాశాలెక్కువ అంటున్నారు పరిశోధకులు.

Laughter Benefits : బీపీని దూరం చేయటంతో పాటు, గుండె ఆరోగ్యానికి మేలు చేసే నవ్వు !

Laughter Benefits

Laughter Benefits : ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నారు సైంటిస్టులు. నవ్వుకీ, గుండె పనితీరుకీ మధ్య సంబంధం ఉందని ఇటీవలి అధ్యయనంలో కనుక్కున్నారు పరిశోధకులు. గతంలో కూడా మేరీలాండ్ యూనివర్సిటీ పరిశోధకులు ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.

READ ALSO : Brushing Your Teeth : రాత్రిపూట పళ్ళు తోముకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుందా ?

మనసులో సంతోషం.. శరీరంలో ఆరోగ్యం

బాధగా ఉన్నప్పుడు మంచి సంగీతం వింటే మనసుకు హాయిగా ఉంటుంది. అదేవిధంగా ఏదో ఒక హాస్యభరిత సినిమా చూస్తే ఆ కాసేపు బాధను మరిచిపోతాం. ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. నవ్వుతూ ఉండడం వల్ల మానసిక భావోద్వేగాలు అదుపులోకి వస్తాయి. అంతేకాదు.. ఆరోగ్యమూ బావుంటుంది. నవ్వుకంత సీన్ ఉందా అని అనిపిస్తుంది గానీ నిజంగా ఇది వంద శాతం నిజం.  టెన్షన్ గా ఉన్నప్పుడు నవ్వుతూ ఎవరైనా పలకరిస్తే కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది. సమస్య నుంచి మైండ్ కొంత డైవర్ట్ అవుతుంది. జబ్బుతో బాధపడుతూ ఉన్నప్పుడు డాక్టర్ ముఖంపై చిరునవ్వుతో ఇచ్చే భరోసా కొండంతఅండనిస్తుంది. మనసు బాధగా ఉన్నప్పుడు ఏదైనా జోక్ విన్నా, హాస్యపు సన్నివేశం చూసినా వెంటనే బాధ నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది.అందుకే కదా.. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎంత పెద్ద నొప్పి అయినా చిన్నదే అనిపిస్తుంది. మనసుకు సాంత్వన కలిగిస్తూ చికిత్స అందించే డాక్టర్ చేతిలో జబ్బు పరారవుతుంది.

READ ALSO : Heart Attack: గుండెపోటుకు ప్రధాన కారణం ఆ సమస్యే.. తాజా అధ్యయనంలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు

బీపీని దూరం చేసే నవ్వు

ఊరికే ముఖం ముడుచుకుని కూర్చోవడం కంటే.. నవ్వితే బాగుంటుంది.. నవ్వడం.. నవ్వించడం.. నవ్వుతూ ఉండడం.. తలుచుకుంటూనే ఎంతో హ్యాపీగా అనిపిస్తోంది కదా.. కానీ ఇప్పటి ఉరుకులు పరుగుల్లో నవ్వుతూ గడపడమనేది చాలా కష్టంగా మారింది.. ఎన్నో టెన్షన్స్.. ఇంట్లో, బయట, ఆఫీస్ ప్రతీ ఒక్క విషయంలోనూ టెన్షన్‌తో గడిపేస్తున్నాం. అందుకే ముఖంపై నవ్వు కరువై అనారోగ్యం పాలబడుతున్నాం. గుండెజబ్బులు పెరగడానికి ఈ టెన్షన్లూ, ఒత్తిళ్లే ప్రధాన కారణాల్లో చేరిపోయాయని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. సైంటిస్టులు కూడా తమ పరిశోధనల ద్వారా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. నిజంగా నవ్వడానికి.. ఆరోగ్యానికి సంబంధముందా అంటే.. ఉందనే చెబుతున్నారు నిపుణులు. ఒత్తిడిలో ఉన్నప్పుడు కాస్తంత నవ్వితే.. ఆ ఒత్తిడి దూరమవుతుంది. ఈ కారణంగా బీపీ, హైపర్ టెన్షన్, ఈ కారణంగా వచ్చే గుండె సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు.

READ ALSO : Heart Health : గుండె ఆరోగ్యం కోసం వైద్యులు తప్పనిసరిగా అనుసరించాల్సిన మార్గాలు !

చిరునవ్వు వెల.. ఒక ఆరోగ్యకరమైన గుండె

ప్రశాంతమైన చిరునవ్వు ఆరోగ్యాన్నే కాదు అనుబంధాలను కూడా మెరుగుపరుస్తుంది. కానీ మనసులో రాగద్వేషాలు పెంచుకుని, అనుబంధాలను తెంచుకుని బతికేస్తున్నాం. ఎప్పుడూ ముఖం మాడ్చుకుని ఉండేవాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. ఇలాంటి వాళ్లలో గుండెజబ్బులు వచ్చే అవకాశాలెక్కువ అంటున్నారు పరిశోధకులు.ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవాళ్ల గుండె కూడా గట్టిదంటున్నారు.నవ్వుకీ, గుండె రక్తనాళాల పనితీరుకీ చాలా దగ్గరి సంబంధం ఉందని 2005లో మేరీలాండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిరూపించారు. నవ్వడం వల్ల రక్తనాళాల లోపలి పొర అయిన ఎండోథీలియమ్ విచ్చుకుని రక్తం మరింత సాఫీగా, ఎక్కువగా ప్రసరణ చెందడానికి వీలుకలుగుతుంది. అందువల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. నవ్వినప్పుడు మెదడు లోని హైపోథాలమస్ బీటా ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇవి ఎండోథీలియందగ్గరున్నరీసెప్టార్లనుయాక్టివేట్ చేస్తాయి. అప్పుడు విడుదలైన నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలు విచ్చుకునేలా చేస్తుంది. నవ్వడం వెనుక ఇంత పెద్ద ప్రక్రియ జరుగుతుంది. అందుకే నవ్వుతూ ఉండే గుండె, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండగలుగుతాయి.

READ ALSO : Heart Attack : కార్డియాక్ అరెస్ట్ , గుండెపోటుకు ప్రమాద కారకాలు, లక్షణాలు , నివారణ !

స్ట్రెస్ తగ్గించే దివ్యౌషధం

శరీరంలో జరిగే వివిధ రకాల జీవరసాయన క్రియల పైన కూడా నవ్వు ప్రభావం పడుతుంది. నవ్వినప్పుడు స్ట్రెస్ హార్మోన్లయినకార్టిసాల్, ఎపినెఫ్రిన్ ల మోతాదు తగ్గుతుంది. అందుకే నవ్వుతో స్ట్రెస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. నవ్వుతున్నప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు కొన్నిసార్లు శారీరక నొప్పులను కూడా తగ్గిస్తాయని అధ్యయనాలున్నాయి. అందుకే నొప్పిలో కూడా యాక్టివ్ గా, చిరునవ్వుతో ఉండడానికి ప్రయత్నించాలంటారు. నవ్వడం వల్ల యాంటిబాడీలను తయారుచేసే కణాలు యాక్టివ్ అవుతాయి. అందువల్ల ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాళ్లలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. అంటే నవ్వుతూ ఉండటం అంటే ఆరోగ్యం వైపు ప్రయాణం చేసినట్టే.