Short people live longer : పొడవుగా ఉన్నవారి కంటే పొట్టిగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారట

మనిషి పొడవు, పొట్టి వారి ఆయుష్షును ప్రభావితం చేస్తాయా? పొడవుగా ఉండే వారికంటే పొట్టిగా ఉండేవారి లైఫ్ స్పాన్ ఎక్కువా? కొన్ని పరిశోధనలు చెబుతున్న అంశాల్లో వాస్తవమెంత?

Short people live longer : పొడవుగా ఉన్నవారి కంటే పొట్టిగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారట

Short people live longer

Updated On : July 22, 2023 / 6:34 PM IST

Short people live longer : పొడవుగా ఉండే వారికంటే పొట్టిగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారు అని చెబుతూ ఉంటారు. నిజానికి కొన్ని పరిశోధనలు ఎత్తు అనేది ఎక్కువకాలం జీవించడానికి గల కారణాలను మాత్రమే వెల్లడించాయి.

Father and Daughter : ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవిస్తారట

పొడవుగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారా? పొట్టిగా ఉన్నవారా? అనే అంశంపై పరిశోధకులు 130 కంటే ఎక్కువ అధ్యయనాలను సమీక్షించారట. దాదాపుగా 1.1 మిలియన్ ప్రజల ఎత్తు గురించి, వారి మరణానికి గల కారణాలపై సమాచారాన్ని సేకరించారట. వ్యక్తుల ఎత్తు.. పలు కారణాలతో వ్యక్తులు చనిపోవడానికి మధ్య సంబంధాన్ని కనుగొన్నారట. గత 30 సంవత్సరాలుగా జరిగిన పరిశోధనల్లో ఎక్కువ ఎత్తు ఉన్నవారు తక్కువ కాలం జీవించి ఉన్నట్లు.. పొట్టిగా ఉన్నవారు ఎక్కువ సగటు జీవితకాలం కలిగి ఉన్నాయని వెల్లడించారు.

 

ఇటాలియన్ మిలిటరీలో పనిచేసిన పురుషుల అధ్యయనం ప్రకారం 161.1 సెం.మీ (సుమారు 5’3″) కంటే తక్కువ ఎత్తు ఉన్నవారు ఎక్కువ కాలం జీవించారట. 70 సంవత్సరాల వయసులో పొట్టిగా ఉన్నవారు పొడవుగా ఉన్నవారి కంటే సుమారు 2 సంవత్సరాలు ఎక్కువగా జీవించే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఇక 2017 లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం 1946-2010 మధ్య బాస్కెట్ బాల్ ఆడుతూ జీవించి, మరణించిన 3,901 మంది క్రీడాకారుల ఎత్తును, జీవితకాలాన్ని కూడా విశ్లేషించారట. మాజీ బాస్కెట్ బాల్ ఆటగాళ్లలో పొడవుగా ఉన్న వారిలో దీర్ఘాయువు తక్కువ అని తేలిందట.

Important Nutrients : 40 ఏళ్ల తర్వాత ప్రతి స్త్రీ తప్పనిసరిగా తీసుకోవాల్సిన 5 ముఖ్యమైన పోషకాలు !

అయితే పొడవాటి వ్యక్తులు తక్కువ జీవితం, పొట్టి వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారు అనేది పూర్తిగా స్పష్టం చేయలేదు. వారి వారి జీవన శైలిని బట్టి కూడా దీర్ఘాయువు ప్రభావితం చేస్తుంది. ఆల్కహాల్, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండటం, ఎక్కువగా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, తక్కువ పొల్యూషన్ ఉన్న ప్రాంతంలో జీవించడం వంటికి కూడా దీర్ఘాయువును పెంచే మార్గాలు. అనేక అధ్యయనాలు ఎత్తు .. జీవిత కాలం మధ్య సంబంధాన్ని కనుగొన్నాయి. అయితే వీటిని గుడ్డిగా ఫాలో అవడం అంత మంచిది కాదు. మంచి జీవన విధానం ఆయుష్షును పెంచుతుంది.