Headache : తలనొప్పి క్షణాల్లో తగ్గాలంటే ఈ టీ తాగి చూడండి!

కాలానుగుణంగా వచ్చే అలర్జీలని కూడా నయం చేస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటితో పాటు పొట్ట ఉబ్బరం సమస్యని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఈ హెర్బల్ టీలో వాము జోడించడం వల్ల అది జీర్ణక్రియకి ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తుంది.

Drink this tea to get rid of headache in seconds!

Headache : ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఎక్కువ మంది తాగేది టీ. బిజీ బిజీ లైఫ్, పని ఒత్తిళ్ల నుంచి అలసిపోయి ఇంటికి రాగానే వేడి వేడి టీ తాగితే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా విపరీతమైన తల నొప్పి వచ్చేస్తుంది. ఆ తల నొప్పి నుంచి బయట పడేందుకు అల్లంతో తయారైన టీ తాగితే ఎంతో రిలాక్స్ గా ఉంటుంది. క్షణాల వ్యవధిలోనే తలనొప్పి తగ్గుతుంది. అల్లం, చమోమిలి రెండూ నాడీ వ్యవస్థని సడలించి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఉన్న ఔషధ గుణాలు తలనొప్పిని పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

కాలానుగుణంగా వచ్చే అలర్జీలని కూడా నయం చేస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటితో పాటు పొట్ట ఉబ్బరం సమస్యని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఈ హెర్బల్ టీలో వాము జోడించడం వల్ల అది జీర్ణక్రియకి ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తుంది. తలనొప్పిని తగ్గేందుకు కూడా సహాయకారిగా తోడ్పడుతుంది. తులసి, చమోమిలికి ఆందోళన తగ్గించే గుణాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన హెర్బల్ టీ ఎలా చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అల్లం స్పెషల్ టీ తయారీ ;

ఈ అల్లం స్పెషల్ టీ తయారీకి 2 కప్పుల నీళ్ళు, 1 అంగుళం అల్లం ముక్క, కొన్ని తులసి ఆకులు, ఒక టీ స్పూన్ వాము, ½ టీ స్పూన్ చామంతి పూలు, కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా తేనె తీసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. అవి బాగా మరుగుతున్నప్పుడు అల్లం, తులసి ఆకులు వేసి మరిగించాలి. తర్వాత వామ్ము, చామంతితో పాటు పిప్పరమెంటు ఆకులు జోడించాలి. ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుని కప్పులోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా తేనె కలిపి తాగొచ్చు.