Sour Juices Instead Of Breakfast
Juices : బరువు తగ్గాలన్న లక్ష్యంతో ఉన్నవారు ఉదయం సమయంలో అల్పాహారం తీసుకోవటం మానేస్తుంటారు. ఉదయం పూట తీసుకునే అల్పాహారానికి బదులుగా జ్యూసులు వంటివి సేవిస్తుంటారు. ఉదయం సమయంలో అల్పాహారం మానేసి జ్యూస్ లు తీసుకునే వారు కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే తీసుకునే జ్యూసుల్లో పులుపు కలిగినవైతే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నం అవుతాయని వైద్యులు చెబుతున్నారు.
రాత్రిపూట 8 గంటలు టైం లో తీసుకున్న ఆహారం తర్వాత ఉదయం మళ్ళీ ఎనిమిది గంటలకు అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ఉదయం అల్పాహారం మిస్ చేసి వాటికి బదులు సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, కమలా, బత్తాయి వంటి జ్యూస్ లు సేవించటం వల్ల కడుపులో గ్యాస్ సమస్య తోపాటు, పుల్లటి తేన్పులు వంటివి వస్తాయి. అంతేకాకుండా రోజంజా చికాకు, తల దిమ్ముగా ఉండటం వంటి లక్షణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఉదయం సమయంలో అల్పాహారం తినకుండా జ్యూస్ లు తాగే వారు జాగ్రత్త వహించాలి.
ఉదయం సమయంలో అరగటానికి ఎక్కువ సమయం పట్టే చపాతి, రోటీ, బీన్స్, క్యారెట్, బీట్రూట్, వంటి ఆహార పదార్ధాలను తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎక్కువ సమయం ఆకలి లేకుండా చూసుకోవచ్చు. తద్వారా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా పులుపుతో కూడిన జ్యూస్ ల జోలికి మాత్రం వెళ్ళొద్దని నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంచటానికి సిట్రస్ జ్యూస్ లు మేలు చేసే మాట నిజమే అయినప్పటికీ ఎక్కవ సమయం ఏమి తీసుకుకుండా ఉండే వారు, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నవారు వీటిని తీసుకోవటం వల్ల సమస్య మరింత రెట్టింపయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి.