Drinking warm water early in the morning during winters has many health benefits!
Drinking Warm Water : చలికాలంలో మనలో చాలా మంది ఉదయాన్నే నిద్రలేచి వేడినీళ్లు సేవిస్తుంటారు. స్నానానికి చేయటానికి గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తారు. వేడి నీరు మన శరీరానికి వేడిని అందించడమే కాకుండా అనేక విధాలుగా ప్రయోజనం లభించేలా చేస్తుంది.ప్రతి రోజూ నిద్రలేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు నిదానంగా కొంచెం కొంచెం తాగాలి. దాని వలన శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి జీర్ణ సంబంధిత సమస్యలు తొలగి, ముఖము జిడ్డు తొలగి, అందంగా తయారవుతుంది.
ఉదయాన్నే టిఫిన్ కంటే ముందు వేడి నీటిని తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు తగ్గుతుంది. ఊబకాయం లేదా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి వేడి నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చలికాలంలో రాత్రిపూట వేడినీళ్లు తాగడం వల్ల బాగా నిద్ర పడుతుంది. బరువు తగ్గడానికి తోడ్పడతాయి. అంతేకాకుండా శ్వాసపక్రియ సక్రమంగా ఉండేందుకు వేడినీరు సహాయపడతాయి.
చలికాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా ఎదురయ్యే మానసిక కుంగుబాటునుండి బయటపడేందుకు వేడి నీటిని తాగడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. డిప్రెషన్ సమస్యకు ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీరు తాగడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. మనకు ఒత్తిడి లేదా నిద్ర సమస్యలు తొలగిపోతాయి. అజీర్తి సమస్య తొలగిపోయి జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వేడి నీటిని తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది.
చలికాలంలో మలబద్ధకం సమస్య చాలా మందిని వేధిస్తుంది. గోరువెచ్చని నీరు ఒక భేదిమందులా పనిచేస్తుంది. మీ పొట్టలోని ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, అలాగే మీ ప్రేగు కదలికలను ప్రేరేపిస్తుంది. ఈ రకంగా మలబద్ధకం సమస్యకు ఫలితం లభిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వలన అధిక రక్తపోటు, స్థూలకాయం, మధుమేహం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి మొదలైన సమస్యలను కలిగిస్తుంది. దీనిని నివారించడానికి ఉదయం నిద్ర లేవగానే వేడినీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
వేడి నీరు తాగటం వలన చర్మం, ముఖంపై దాని ప్రభావం ఉంటుంది. ముఖానికి అద్భుతమైన మెరుపునిస్తుంది. పీరియడ్స్ నొప్పితో బాధపడే ఆడవారు ఉదయం పూట కొన్ని కప్పుల గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో అధికంగా ఎదురయ్యే సమస్య గొంతునొప్పి. రోజువారిగా గోరువెచ్చని నీరు సేవించేవారిలో గొంతినొప్పి సమస్యలు దరిచేరవు.