Eating some fruits without peeling
Fruits For Health : రోజువారి ఆహారపు అలవాట్లలో భాగంగా పండ్లను ఆహారంగా తీసుకోవటం చాలా మందికి అలవాటు. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పండ్లను తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన నీరుతోపాటు, పోషకాలు అందుతాయి. కొంత మంది పండ్లు తినేందుకు పెద్దగా ఇష్టపడరు. ఆరోగ్యం బాగాలేని సందర్భంలో వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా చెప్పే విషయం పండ్లు బాగా తినమని. అయితే అప్పుడేదో తాత్కాలికంగా ఆరోగ్యం కుదుటపడాలని నాలుగు రోజులు తిన్నా తరువాత వాటి మొఖం కూడా చూడరు. అలా చేయటం ఏమాత్రం సరికాదంటున్నారు నిపుణులు ఆరోగ్యానికి పండ్లను తీసుకోవటం ఎంత అవసరమో, పండ్లపై ఉండే తొక్కతో సహా తినటం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
తొక్క తొలగించకుండా తినాల్సిన పండ్లు ;
అరటి పండు తొక్కలో ఎన్నో పోషకవిలువలుంటాయి. మరెన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అరటి తొక్కల్లో విటమిన్ బి6, విటమిన్ బి12, పొటాషియం, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అరటిపండును తొక్క తీయకుండా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఆరెంజ్ పండును తొక్క తీసుకుని తినాలి. తొక్కతీసినతరువాత దబ్బలను అంతే నమిలి తినేయాలి. ఇలా చేయటం వల్ల ఫైబర్ పోకుండా ఉంటుంది. ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఈ పండును తినడం మంచిది.
జామపండులో కూడా ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని తొక్కతో సహా తినేయడం మంచిది. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కివి పండును తొక్క తీయకుండా తినవచ్చని చాలా మందికి తెలియదు. ఈ పండు తొక్కలో ఫైబర్, ఫోలేట్, విటమిన్ ఇ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఆపిల్ పండ్లను తొక్క తీసి తింటుంటారు. దీన్ని తొక్క తీసేసి తినడం తప్పుడు విధానమని వైద్యులు చెబుతున్నారు. ఆపిల్ తొక్క తీస్తే దానిలో ఉండే పీచు పదార్థం పోతుంది. దీంతో మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందవు. ప్లమ్ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అందుకే ఫ్రూట్ ను తొక్కతో కలిపి తినాలి. ఈ పండు మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
మామిడి పండు తొక్కలో అనేక పోషకాలున్నాయి. ముఖ్యంగా పచ్చి మామిడి తొక్కలో శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి, ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. విటమిన్ ఎ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి గాయాలను నయం చేయడంలో సహయపడుతుంది. పుచ్చకాయ తొక్క తినడం వల్ల ఇందులోని విటమిన్ సి, ఎ, సి, బీ6, పొటాషియం, జింక్ పుష్కలంగా అందుతాయి. కివి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహయపడుతుంది. అలాగే దాని పై తొక్కలో ఫైబర్, ఫోలేట్, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది గుండె, క్యాన్సర్, మధుమేహానికి మంచిది. నిమ్మకాయ తొక్కలో పొటాషియం, విటమిన్ సి, కాల్షియం ఉంటాయి. నిమ్మ తొక్క లో తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు, క్యాన్సర్‌తో పోరాడడం, ఎముకల ఆరోగ్యం, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.