Food : తినే ఆహారాన్ని బట్టే ఆనందం!

ప్రాసెస్డ్ ఫుడ్స్ తో పోలిస్తే, ముడి ధాన్యాలను, ఆహారంగా తీసుకునే వారిలో కుంగుబాటు లక్షణాలు తక్కువగా కనిపిస్తాయని అధ్యయనాల్లో తేలింది.

Befunky Photo (2)

Food : మనిషి జీవన ప్రయాణ అంతిమ లక్ష్యం ఆనందం మాత్రమే. ఆనందం అనేది చేసే పనులను బట్టే కాదు, తినే తిండిని బట్టి కూడా లభిస్తుంది. ఇదే విషయాన్ని పోషకాహార నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. డోపమైన్ అనేది ఒక న్యూరో ట్రాన్స్ మిటర్. దీన్నే ఆనంద హార్మోన్ అని కూడా అంటారు. డోపమైన్ సమృద్ధంగా ఉన్న ఆహారంలో ఆనంద రసం పరిపూర్ణంగా ఉంటుందని అనేక అధ్యయనాల్లో తేలింది.

డొపమైన్ తో కూడిన ఆహారం తీసుకోవటం వల్ల శరీర బరువును తగ్గించుకోవటంలోను సహాయపడుతుంది. పాలు, జున్ను , పెరుగు లాంటి పాల ఉత్పత్తులు, శరీరానికి మంచి బ్యాక్టీరియాను అందించే ప్రొబయోటిక్స్ కు చిరునామాగా ఉంటాయి. ఇవి శరీరంలో మూడ్ ను ఆహ్లాదంగా మార్చే డొపమైన్ హార్మోన్ ను చైతన్య పరుస్తాయి. గుడ్లు అరటిపండ్లు సైతం ఇదే తరహాలో దోహదపడతాయి.

అమైనో అమ్లాలు ఉండే ఆహారం తీసుకోవటం వల్ల ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అమైనో అమ్లాల నుండే డోపమైన్ ఉత్పత్తి జరుగుతుంది. చక్కెర తో తయారు చేసి స్వీట్లు తినాలనుకునే వారు డార్క్ చాక్లెట్ తినటం మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే టైరోసైన్ అనే అమైనో ఆమ్లం నుండి డోపమైన్ ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా మూడ్ ను నియంత్రించే సెరోటోనిన్, ఎండార్ఫిన్ హార్మోలన్లు డార్క్ చాక్లెట్ లో ఉంటాయి.

ప్రాసెస్డ్ ఫుడ్స్ తో పోలిస్తే, ముడి ధాన్యాలను, ఆహారంగా తీసుకునే వారిలో కుంగుబాటు లక్షణాలు తక్కువగా కనిపిస్తాయని అధ్యయనాల్లో తేలింది. పొట్టు తీయని గింజలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, తాజా పండ్లు , బీన్స్ మొలకలను ఆహారంగా తీసుకోవటం మంచిది. ఈ తరహా ఆహారం తీసుకోవటం వల్ల ఆనందం పొందవచ్చు.