Erectile Dysfunction : కొవిడ్ దీర్ఘకాలిక కొత్త లక్షణంగా అంగస్తంభన సమస్య.. యువతలోనే హైరిస్క్ ఎక్కువ..!

కరోనా సోకిన పురుషుల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని అంటున్నారు. పురుష జనాభాలో దీర్ఘకాలిక ప్రభావాలు అధికంగా ఉంటున్నాయని చెబుతున్నారు.

Erectile dysfunction new symptom of long Covid : కరోనా వైరస్ పురుషులకు ప్రాణాంతకమని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా సోకిన పురుషుల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని అంటున్నారు. కరోనా వైరస్ కారణంగా పురుష జనాభాలో దీర్ఘకాలిక ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా యువతలో అంగస్తంభన సమస్య దీర్ఘకాలిక కొవిడ్ లక్షణంగా ఉండొచ్చునని బ్రిటన్ వైద్యులు చెబుతున్నారు. అందులోనూ బ్రిటన్ యువతకు హైరిస్క్ ఉందని హెచ్చరిస్తున్నారు. యువతలో దీర్ఘకాలిక కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్ శ్వాససంబంధిత వ్యాధి (Coronavirus infection) అయినప్పటికీ.. రక్త నాళాలపై ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. తద్వారా రక్తనాళాలు మూసుకుపోయి పురుషుల అంగానికి రక్త సరఫరా అందదు. రక్త ప్రసరణ అయినప్పుడే అంగం స్తంభించగలదని సైంటిస్టులు సూచిస్తున్నారు. అంగంలోకి రక్తం రాకపోతే.. స్తంభన నిలిచిపోతుందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా కొరోనరీ ఆర్టరీ వ్యాధి, హై బ్లడ్ ప్రెజర్, డయాబెటిస్ (coronary artery disease, high blood pressure, diabetes) వంటి ఇతర వ్యాధులు అంగస్తంభన సమస్య (Erectile dysfunction) కు ప్రమాద కారకాలని చెబుతున్నారు. రక్త నాళాలు దెబ్బతినడంతో అంగస్తంభన సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుంది.

దీర్ఘకాలిక కొవిడ్ లక్షణంగా అంగస్తంభన :
కరోనావైరస్ బారిన పడిన కొంతమంది రోగుల్లో ఈ సమస్య ఉందని గుర్తించారు. శృంగారానికి టీకా ముందుగా వేయించుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. తగినంత రక్త సరఫరాను సమర్థవంతంగా అందించలేనప్పుడు అంగస్తంభన సమస్యకు దారితీస్తుందని అంటున్నారు. ఇటలీలోని రోమ్ టోర్ వెర్గాటా యూనివర్శిటీలోని ఎండోక్రినాలజీ మెడికల్ సెక్సాలజీ ప్రొఫెసర్ (Emmanuele Jannini) కూడా అంగస్తంభన దీర్ఘకాలిక కోవిడ్ లక్షణంగా ఉండవచ్చని హెచ్చరించారు.

కోవిడ్ -19 నుంచి కోలుకున్న వ్యక్తుల్లో అంగస్తంభన సమస్య (symptom of long Covid) దీర్ఘ కాలం పాటు ఉండొచ్చునని తెలిపారు. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందకపోయినా కూడా అంగస్తంభన పనితీరును దెబ్బతీస్తుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. కోవిడ్‌తో న్యుమోనియాకు గురైన బాధితులకు ఎక్కువ ముప్పు ఉందని ప్రొఫెసర్ జాన్నిని చెప్పారు. కోవిడ్-సంబంధిత ఒత్తిడి లేదా ఆందోళనతో కలిగే మానసిక ఆరోగ్య సమస్యలు కూడా అంగ స్తంభన సమస్యలకు కారణం కావొచ్చునని తెలిపారు. కొవిడ్ అంగస్తంభన సమస్యకు ఎలా దారితీస్తుందో నిర్ధారించేందుకు లోతైన అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు