Castor Oil : జిడ్డుగా ఉన్నా శిరోజాల ఆరోగ్యానికి మేలు చేసే ఆముదం!

ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది తలపై మంటలు తగ్గిస్తుంది. ఎక్కవ సమయం తలపై పొరలాగా ఉండి జట్టు సిల్కీగా మారేలా చేస్తుంది. ఇది జుట్టును తేమగా ఉంచి పెరిగేలా చేస్తుంది.

Castor Oil

Castor Oil : ఆముదం జుట్టు పెరుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది. జిడ్డుగా ఉన్నా ఇందులో విటమిన్ ఇ, ప్రొటీన్లు, మినరల్స్ వంటి పోషకాలు ఉన్నాయి. యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కూడా కలిగి ఉండటం వల్ల చుండ్రు ,ఇతర జుట్టు సమస్యలను తొలగించటంలో సహాయకారిగా పనిచేస్తుంది. తలపై ఇన్ఫెక్షన్లను నివారించేందుకు ఉపకరిస్తుంది.

ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది తలపై మంటలు తగ్గిస్తుంది. ఎక్కవ సమయం తలపై పొరలాగా ఉండి జట్టు సిల్కీగా మారేలా చేస్తుంది. ఇది జుట్టును తేమగా ఉంచి పెరిగేలా చేస్తుంది. తలభాగంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తలపై ఈనూనెతో సున్నితంగా మసాజ్ చేయటం వల్ల ఒత్తిడి నుండి బయటపడవచ్చు. జుట్టు బలంగా ఉండాలంటే ఆముదం నూనె ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు తలకు పట్టిస్తే సరిపోతుంది. ఇలా చేయటం వల్ల దృఢమైన, పొడవాటి జుట్టును పొందవచ్చు.

చుండ్రు, పొడిబారడం, చివర్లు చీలిపోవడం, చిట్లడం ,జుట్టు రాలడం వంటి అనేక సమస్యలను ఆముదం నూనె సమర్థవంతంగా అరికడుతుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఆముదంలో పుష్కలంగా ఉంటాయి. ర్మసంబంధమైన ముడతలను నివారించడానికి సహాయం చేస్తుంది. అతినీలలోహిత కిరణాలు యొక్క ప్రభావం చర్మంపై పడకుండా కాపాడుతుంది. కుదుళ్లకు కండీషర్‌గా పని చేస్తుంది. తల బాగా నొప్పిగా, వేడిగా ఉన్నప్పుడు ఆముదం నూనెను రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.