Weigh Less Morning : ఉదయం బరువు తగ్గుతారట. ఎప్పుడైనా చెక్ చేశారా? అసలు కారణం ఇదే..!

Ever Noticed You Tend to Weigh Less in the Morning : మీ అసలు బరువు ఎంత? ఎప్పుడైనా గమనించారా? వెయిట్ మిషన్‌పై చెక్ చేసుకుంటాము కదా? అంటారా? వాస్తవానికి మీ అసలు బరువు అది కాదంట.. మీరు ఎంత బరువు ఉన్నారో కచ్చితంగా తెలియాలంటే ఒక సమయం ఉందంట.. ఆ సమయంలో మాత్రమే మీ అసలైన బరువు తెలుసుకోవచ్చునని అంటున్నారు నిపుణులు. సాధారణంగా చాలామంది బరువు తగ్గేందుకు ఎన్నో కుస్తీలు పడుతుంటారు.

మీ అసలు బరువు ఎంతో తెలుసుకోవాలంటే.. ఉదయం మాత్రమే సరైన సమయమని అంటున్నారు. రాత్రి పూట ఉన్న బరువు ఉదయానికి తగ్గిపోతారంట.. ఉదయం ఒక బరువు ఉంటే.. రాత్రిపూట మరికొంత బరువు పెరిగిపోతారంట.. మరి.. ఉదయం పూట ఎందుకు బరువు తగ్గిపోతారో కూడా నిపుణులు వివరించారు. దీనికి అనేక కారణాలు ఉంటాయని అంటున్నారు.

బరువు తగ్గడానికి కారణాలివే :
వాస్తవానికి రాత్రిపూట నిద్రపోయాక మీరు ఏమి తినరు, తాగరు.. ఇదే మీరు బరువు తక్కువగా ఉండటానికి కారణమంటున్నారు. శరీరంలోని ఫ్లూయిడ్స్ రాత్రంతా డైజేషన్ అయిపోతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నిత్యం జరిగే సాధారణ బాడీ ఫంక్షన్ లో శ్వాస తీసుకోవడం, చెమటలు పట్టేయడం, అర్థరాత్రి సమయంలో బాత్ రూంకు వెళ్లడం వంటి చర్యల ద్వారా శరీరంలో నీరంతా కోల్పోతారంట..

పెద్దవారిలో 50 నుంచి 60 శాతం నీటిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. తద్వారా కొన్ని పౌండ్ల వరకు బరువు తగ్గిపోతారని అంటున్నారు. రాత్రంతా నిద్రించే సమయంలో డైజేషన్ కారణంగా చాలా కేలరీలు కరిగిపోతాయి. దీని ఫలితం ఉదయం లేచిన తర్వాత కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు మనిషి బరువు రెండు పౌండ్ల వరకు తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. అంతకుముందు రోజు మీరు ఏమి తిన్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది.
ఎప్పుడు తిన్నారు? ఎప్పుడూ టాయిలెట్ కు వెళ్లారు అనేది కూడా ప్రధాన కారణమని చెబుతున్నారు. ఉదయం సమయంలో కచ్చితమైన బరువు ఎప్పుడూ తెలుసుకోవచ్చో కూడా నిపుణులు వివరించారు. ఉదయం పూట ఏమి తినకుండా తాగకుండా ఉన్నప్పుడు మాత్రమే బరువు చెక్ చేసుకోవాలి.

అది కూడా శరీరంపై ఎలాంటి బట్టలు ఉండొద్దు. ప్రతిసారి ఒక రోజులో ఒకే సమయంలో మీరు బరువు చూసుకోవాలని సూచిస్తున్నారు. డిహైడ్రేషన్ లేదా ప్రేగు కదలికల వల్ల రోజువారీ బరువులో హెచ్చుతగ్గులు ఉంటాయని అంటున్నారు. వారానికి ఒకసారి గరిష్టంగా బరువు పెరుగుతారని అనుకుంటున్నాను, రోజుకు మీ బరువు మీ కొవ్వు లేదా కండరాలలో తేడా లేకుండా గణనీయంగా మారుతుంటుందని పేర్కొన్నారు. ఏది ఏమైనా బరువు తగ్గాలనుకునే వారు తమ ప్రయత్నంలో భాగంగా ముందుగా మీ వైద్యుడ్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు