Thirst
Thirst : మనిషి శరీరానికి నీరు ఎంతో అవసరం. నీరు ప్రాణాధారమని , ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే రోజుకు ఏడు నుండి ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తుంటారు. మన శరీరానికి సరిపడా నీటిని తాగటం వల్ల మనం తీసుకునే ఆహార పదార్థాలు తొందరగా జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో నీరు ఎంతో ఉపయోగపడుతుంది. పదేపదే నీళ్లు తాగాలని కోరిక కలిగితే మీ శరీరంలో కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇది తరువాత ప్రాణాంతక పరిణామాలను కలిగిస్తుంది. కాబట్టి దీనిని ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు. ఇలా అధిక దాహంతో తరచూ నీళ్లు తాగే వారిలో కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి.
శరీరంలో రక్తం తక్కువగా ఉంటే, మీరు మళ్లీ మళ్లీ దాహం వేయవచ్చు. అంటే రక్తంలో ఆర్‌బిసి ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. తల తిరుగుతున్నట్లు ఉన్నసమయంలో కూడా అదేపనిగా దాహం వేస్తుంది. బాగా అలసిపోయిన సందర్భంలో, బలహీనంగా ఉన్నా దాహం దేస్తుంది. హైపర్‌కాల్సెమియా అంటే రక్తంలో కాల్షియం అవసరానికి మించి ఉంటే. హైపర్‌కాల్సెమియా కారణంగా అధిక దాహం సమస్య ఉత్పన్నమౌతుంది.
మాటిమాటికీ నీళ్లను తాగుతున్నారంటే షుగర్ సమస్య ఉండి ఉండవచ్చు. షుగర్ సమస్య ప్రారంభంలో ఉన్నా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. అందుకనే దాహం ఎక్కువగా అవుతుంది. కనుక నీళ్లను ఎక్కువగా తాగుతారు. మాటిమాటికి నీళ్లను తాగే వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఉంటాయి. అవసరానికి మించి దాహం వేస్తున్న వారిలో భవిష్యత్తులో షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉంటాయి.
కొన్నిసార్లు మనం అధిక కారం కలిగిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఆహార పదార్థాలు తేలికగా జీర్ణం కావు. అలాంటి సమయంలో ఎక్కువగా నీరు అవసరం అవుతుంది కనుక అధిక మొత్తంలో దాహం వేస్తుంది. ఇంకా చెప్పాలంటే స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఆహారం తేలికగా జీర్ణం కాదు. సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ నీరు కావాలి. దీని కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది అధిక దాహానికి కారణం అవుతుంది. అందుకనే నీళ్లను తాగుతాం. ఇది తాత్కాలికమైనదే. కనుక ఇలాంటి సందర్భంలో నీళ్లను అధికంగా తాగుతుంటే ఖంగారు పడాల్సిన పనిలేదు.
మన శరీరానికి నీరు అవసరం అయినప్పుడు విపరీతంగా చెమటలు పడతాయి. ఈ క్రమంలోనే శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి నీటిని తాగాల్సి ఉంటుంది. ఇక చాలామంది ఏదైనా కంగారుగా లేదా ఆందోళనకరమైన విషయాలు విన్నప్పుడు నోరు మొత్తం పొడిబారిపోతుంది. ఈ సమయంలో అధికంగా దాహం వేస్తూ ఉంటుంది. ఇలా శరీరానికి సరిపడా నీటి కన్నా అధికంగా తాగినప్పుడు మీరు మధుమేహంతో, జీర్ణ క్రియ సమస్య లేదా ఏదైనా ఆందోళనలో ఉన్నారని, అందుకనే నీళ్లను తాగుతున్నారని స్పష్టమవుతుంది.
శరీరం ఎక్కువగా చెమట పట్టడం ప్రారంభిస్తే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి ఎక్కువ నీటిని కోరుతుంది. దీని కారణంగా మనకు మరింత దాహం అనిపిస్తుంది. అదేవిధంగా నూనె పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు కూడా దాహం వేస్తుంది. ఈ సందర్భంలోనూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇవి కాకుండా సాధారణ సమయంలోనూ నీళ్లను ఎక్కువగా తాగుతున్నారంటే.. అనుమానించాల్సిందే. వెంటనే డాక్టర్‌ను కలసి పరీక్షలు చేయించుకుని అవసరం అయితే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.