Week Exercise Covid Risk : వారంలో 150 నిమిషాలకు పైగా వ్యాయామం… కరోనా వచ్చే ఛాన్స్ తక్కువట!

కరోనా మహమ్మారి వ్యాప్తితో అందరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్రతిఒక్కరూ ఇప్పుడు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారు. వ్యాధినిరోధకతను పెంచుకోనేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు.

Week Exercise 150 minutes : కరోనా మహమ్మారి వ్యాప్తితో అందరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్రతిఒక్కరూ ఇప్పుడు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారు. వ్యాధినిరోధకతను పెంచుకోనేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం.. వ్యాయామంతో వ్యాధినిరోధకతను పెంచుకోవచ్చునని ఓ అధ్యయనం వెల్లడించింది. వారంలో 150 నిమిషాల కంటే ఎక్కువ సమయం వ్యాయామం చేసేవారిలో కరోనావైరస్ సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని తేలింది. సాధారణంగా వ్యాయామం ద్వారా శరీరం చాలా చురుకుగా మారుతుంది.

శరీరంలో కండరాలు మృదువుగా మారడంతో పాటు అవయవాలను బలంగా తయారవుతాయి. తద్వారా ఎలాంటి వ్యాధులునైనా తట్టుకునే శక్తిని పెంచుతుందని గుర్తించారు. అలాగే వ్యాయామంతో కూడా ఎక్కువ కాలం జీవించవచ్చు. హార్వర్డ్ హెల్త్‌ అధ్యయనం ప్రకారం.. శారీరక శ్రమలేని వారిలో తీవ్రమైన కరోనా ముప్పు ఉందని అంటున్నారు. ఈ అధ్యయనంలో 48,440 మంది నుంచి డేటాను సేకరించారు. కరోనా సోకిన వ్యక్తుల్లో తీవ్ర అనారోగ్యానికి గురికాకుండా కాపాడేందుకు సాధారణ వ్యాయామం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని తేలింది.

అమెరికాలో ఆస్పత్రులలో 48,000 మందికి పైగా కరోనా పాజిటివ్ వ్యక్తులపై అధ్యయనం నిర్వహించారు. వ్యాయామం అధికంగా చేసేవారిలో కరోనా ముప్పు ఎంతవరకు ఉందో విశ్లేషించారు. 2000లో జనవరి, అక్టోబర్ మధ్య 18ఏళ్లు పైబడిన 48,000 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. సగటున, వారానికి ఎన్ని రోజులు మితమైన కఠినమైన వ్యాయామం చేస్తుంటారో చెప్పాలని అడిగారు. తక్కువ శారీరక శ్రమ కలిగినవారిలో అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి అనారోగ్యాలతో ముడిపడి ఉందని గుర్తించారు. కరోనా నుంచి తీవ్రమైన అనారోగ్యం, మరణానికి ఎక్కువ ముప్పు ఉందని తెలిపారు.

వారంలో వ్యాయామం చేసేవారిని మూడు గ్రూపులుగా విభజించారు. మొదట గ్రూపులో వారానికి 150 నిమిషాలకు పైగా.. రెండవ గ్రూపులో వారానికి 0 నుండి 10 నిమిషాలు, మూడవ గ్రూపులో వారానికి 11 నుంచి 149 నిమిషాల వ్యాయామం చేయమని అడిగారు. అందులో వయస్సు, లింగం, జాతి, మధుమేహం, జీవనశైలి, మధుమేహం, అధిక రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు లేదా మూత్రపిండాల వ్యాధి వంటివి పరిగణనలోకి తీసుకున్నారు. వ్యాయామం ఎక్కువగా చేసిన వారిలో కరోనా ముప్పు చాలా తక్కువగా ఉందని తేల్చారు.

వ్యాయామం చేయని వారికి.. వారంలో కనీసం 150 నిమిషాలు కంటే ఎక్కువ సమయం పనిచేసే వ్యక్తుల కంటే ఆసుపత్రిలో చేరడం, ఐసియులో చేరడంతో పాటు కరోనా నుంచి మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం కనుగొంది. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం ద్వారా కరోనా ముప్పు నుంచి తప్పించుకోవచ్చునని తేలింది. మరొక అధ్యయనం ప్రకారం.. మధ్య వయస్సు వారిలో శారీరక వ్యాయామం ద్వారా మతిమరుపు వచ్చే ప్రమాదాన్ని 30 శాతం గణనీయంగా తగ్గిస్తుందని కనుగొన్నారు.

ట్రెండింగ్ వార్తలు