Butter Content In Cattle Milk : పశువుల పాలల్లో వెన్నశాతం తగ్గటానికి కారణాలపై రైతులకు అవగాహన తప్పనిసరి!
ఎక్కువ మోతాదులో నూనెచెక్కలను మేపితే క్రమేపి వెన్నశాతం తగ్గుతుంది. మేతల్లో క్రూడ్ ప్రొటీన్ తగ్గినా, వెన్నశాతం తగ్గుతుంది. మేతల్లో భాస్వరం తగ్గినా, వెన్నశాతం తగ్గుతుంది.

Farmers must be aware of the reasons for the decrease in butter content in cattle milk!
Butter Content In Cattle Milk : వ్యవసాయంలో భాగంగా పాడిపశువుల పెంపకంతో రైతులు లభ్ధి పొందుతున్నారు. పాడిపశువులు అధిక పాల దిగుబడి ఇవ్వాలంటే వారి సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పాలల్లో వెన్నశాతం తగ్గటానికి కొన్ని ప్రత్యేక పరిస్ధితులు కారణమౌతాయి. పశువులకు ఇచ్చే ఆహారంలో పీచు పదార్థాల తగ్గుదల ఉంటే వెన్న శాతం తగ్గుతుంది. పీచురహిత పిండిపదార్థాలు, అసిటిక్ ఆమ్ల ఉత్పత్తిని తగ్గించి, పాలలో వెన్నశాతాన్ని ప్రభావితం చేస్తాయి.
అధిక మోతాదులో సొమెటిక్ కణాల సంఖ్య, వెన్న శాతం తగ్గిస్తుంది. వాతావరణంలో ఎక్కువ తేమ ఉండే కాలంలో వెన్న శాతం తగ్గుతుంది. పశువుకు శక్తినిచ్చే పదార్థాలతో కూడిన దాణా తగ్గిస్తే దీనికారణంగా క్రమేపి పాలలో వెన్న శాతం తగ్గిపోతుంది. పశువుల ఆరోగ్యసంరక్షణకై తగు మోతాదులో దాణా తప్పక ఇవ్వాలి. మేలు జాతి రకాలైన పచ్చిమేతలను పశువుల బరువుకు తగ్గట్టుగా అందించాలి.
ఎక్కువ మోతాదులో నూనెచెక్కలను మేపితే క్రమేపి వెన్నశాతం తగ్గుతుంది. మేతల్లో క్రూడ్ ప్రొటీన్ తగ్గినా, వెన్నశాతం తగ్గుతుంది. మేతల్లో భాస్వరం తగ్గినా, వెన్నశాతం తగ్గుతుంది. పశువులు అసౌకర్యానికి, అనార్యోగానికి గురైతే పాల ఉత్పత్తితో పాటు వెన్నశాతం కూడా తగ్గుతుంది. పాడి పశువులకు మేత తక్కువైనప్పుడు, అధిక ఎండలు, చలి తీవ్రత ఉన్నప్పుడు పాలలో వెన్నశాతం తగ్గుతుంది. గేదె పాలలో 6 నుండి 8 శాతం, దేశవాళీ ఆవు పాలలో 4 నుండి 4.5 శాతం, సంకరజాతి ఆవుల్లో వెన్న 3 నుండి 4 శాతం వరకు ఉంటుంది.
పాలలో వెన్నశాతం. పాడి పశువుల జన్యు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. పశువుల జాతి ఆధారంగా వెన్నశాతంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. సంకరజాతి పశువుల్లో పాల ఉత్పత్తి ఎక్కువున్నా, వెన్నశాతం తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు పాలలో వెన్నశాతాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల కొట్టాల్లో అధిక వేడి లేదా అధిక చలి ఉండకుండా జాగ్రత్తలు చేపట్టాలి. వేసవిలో ముఖ్యంగా సాయంత్రం పూట పిండే పాలలో వెన్నశాతం తక్కువగా ఉంటుంది.