HMPV Virus : ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ వైరస్ విజృంభణ.. బంగ్లాదేశ్‌లో మొదటి మరణం!

HMPV Virus : బంగ్లాదేశ్‌లో హెచ్ఎంపీవీ వైరస్ మొదటి మరణం సంభవించింది. ఈ వైరస్ బారినపడి ఒక మహిళ మృతిచెందింది.

HMPV Virus

HMPV Virus : ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వైరస్ విజృంభిస్తోంది. భారత్ సహా పలు దేశాల్లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు అయ్యాయి. బంగ్లాదేశ్‌లో కూడా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో హెచ్ఎంపీవీ వైరస్ మొదటి మరణం సంభవించింది. ఈ వైరస్ బారినపడి ఒక మహిళ మృతిచెందింది.

Read Also : HMPV Virus : ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్.. బారినపడ్డ 14వేల మంది అమెరికన్లు.. సీడీసీ రిపోర్టులో సంచలన విషయాలు

ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంజిదా అక్తర్ అనే మహిళ ఆదివారం నుంచి వైరస్ బాధిత అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించినట్టు ఆస్పత్రి సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ అరిఫుల్ బషర్ ఈ ప్రకటన విడుదల చేశారు.

వైరస్ బాధిత మహిళ ఇప్పటికే స్థూలకాయం, కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతుంది. అంతేకాదు.. హెచ్‌ఎంపీవీ మొదటి కేసు నమోదైన కొద్ది రోజులకే ఆ మహిళ చనిపోయింది. బంగ్లాదేశ్‌లో ఆ మహిళకు పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చింది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ డిసీజ్ కంట్రోల్ అండ్ రీసెర్చ్ (ఐఇడీసీఆర్) వైరాలజీ హెడ్ అహ్మద్ నౌషర్ ఆలం మాట్లాడుతూ.. మహిళకు క్లేబ్సియెల్లా న్యుమోనియా అనే ఒక రకమైన న్యుమోనియా ఉందని పరీక్షలో నిర్ధారణగా.. అది పాజిటివ్‌గా వచ్చింది. అయితే, ఈ మహిళ విదేశాలకు వెళ్లలేదని చెప్పారు.

2017లో బంగ్లాదేశ్‌లో తొలిసారిగా హెచ్ఎంపీవీ కనుగొన్నారరని (IEDCR) డైరెక్టర్ తహ్మీనా షిరిన్ చెప్పారు. అప్పటి నుంచి వైరస్ దాదాపు ప్రతి ఏడాదిలో శీతాకాలంలో విజృంభిస్తోంది. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. హెచ్ఎంపీవీ వైరస్ అనేది 2001లో కనుగొన్న రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ న్యుమోవిరిడే వేరియంట్‌గా చెబుతున్నారు.

సీడీసీ ప్రకారం.. హెచ్ఎంపీవీ అన్ని వయస్సుల వారికి వ్యాపిస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులపై ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో కొన్ని లక్షణాలలో దగ్గు, జ్వరం, నాసికా రద్దీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఉన్నాయి. కోవిడ్-19, ఫ్లూ కాకుండా హెచ్ఎంపీవీ చికిత్స లేదా వ్యాక్సిన్ లేదా యాంటీవైరల్ మందులు లేవు.

Read Also : HMPV Virus Symptoms : పెరుగుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు.. లక్షణాలు ఏంటి? ఎవరెవరికి రిస్క్ ఎక్కువంటే?