Flaxseeds control high cholesterol in the body!
Flax Seeds : ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం, క్షీణించిన జీవనశైలి కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల సిరల్లో రక్తం పేరుకుపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్.. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, సంతృప్త కొవ్వులు ఈ సీజన్‌లో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఈ సీజన్‌లో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలంటే ఆహారం విషయంలో ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారాల్లో అవిసెగింజలు కూడా ఒకటి. ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అవిసె గింజలలో పుష్కలంగా ఉంటాయి. చేపల వంటి మాంసాహారం తరువాత ఆ యాసిడ్లు అధికంగా లభించే ఆహారాల్లో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తికి మంచిది. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. అవిసెల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటాక్సిడెంట్లు, పీచు ఎక్కువ. షుగర్, క్యాన్సర్, గుండె జబ్బులను నివారించటంలో అవిసె నూనె సమర్థమైనదని పరిశోధనల్లో కూడా రుజువైంది. అవిసె గింజల ద్వారా పూర్తి ప్రయోజనం దక్కాలంటే వాటిని దంచి, పొడి చేసి లేదా నూనె రూపంలో తీసుకోవాలి.
ముఖ్యంగా ఇందులో శరీర కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చాలా రకాల గుణాలు ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకుంటే శరీరానికి ప్రయోజనాలు కలగడమేకాకుండా..శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ గింజల పొడిని ప్రతి రోజూ పాలలో వేసుకుని తాగితే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్సను పొందగలరు.