కరోనా భయంతో ముద్దు సీన్లలో యాక్టర్లకు బదులు ఈ బొమ్మలు వాడేస్తున్నారు

  • Publish Date - July 15, 2020 / 07:37 PM IST

మహమ్మారి కరోనా ఎంత పనిచేసింది.. ప్రపంచాన్నే మార్చేసింది.. మనుషులను మార్చేసింది.. వారి ఆలోచనల్లోనూ మార్పు తెచ్చింది. కరోనా భయంతో బయటకు వెళ్తే ముఖానికి మాస్క్ లేకుండా వెళ్లడం లేదు. ఏం పనిచేసినా కరోనానే గుర్తుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏది ముట్టుకోవాలన్నా..ఎవరిని తాకాలన్నా భయమేస్తోంది. ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియనట్టు.. ఎవరికి కరోనా ఉందోనన్న భయమే ఎక్కువగా అందరిలో కనిపిస్తోంది.

ఒకప్పుడు హుషారుగా రద్దీగా జరిగే సినిమా, టీవీ షో షూటింగ్‌లు సైతం కరోనా దెబ్బకు ట్రెండ్ మార్చేశాయి. షూటింగ్ సమయాల్లో ఎక్కడ చూసినా సామాజిక దూరం, మాస్క్ ల వాతావరణమే కనిపిస్తోంది. ముద్దు సీన్లలోనూ కరోనా భయమే కనిపిస్తోంది. ముద్దు సన్నివేశాలు పండాలంటే.. కెమిస్ట్రీ వర్కౌట్ కావాలంటే కరోనాతో కష్టమే మరి అన్నట్టుగా ఉంది.
అందుకే షూటింగ్స్‌లలో ప్రత్యేకించి ముద్దు సీన్లలో యాక్టర్లకు బదులుగా బొమ్మలతో సరిపెట్టేస్తున్నారు. ఫైట్ స్టంట్ సీన్లలో డూప్ పెట్టినట్టు ఇప్పుడు ఈ బొమ్మలను పెట్టేస్తున్నారు. ఒకరిని ఒకరు ముట్టుకునేది లేదు.. ముద్దు సీన్లలోనూ ఇక బొమ్మలతోనే రొమాన్స్ చేయాల్సి ఉంటుంది.

కోవిడ్ నిబంధనల ప్రకారం.. ఇవన్నీ జాగ్రత్తలు పాటించాల్సిందే.. అందుకే టీవీ షోలు, సినిమా నిర్మాతలు, షో నిర్వాహకులు, యాక్టర్లు అంతా క్రియేటీవిటికి పనిచెబుతున్నారు. సినిమాలు, టీవీ షోల్లో లవ్ సీన్లు లేకుంటే ప్రేక్షకులకు కిక్కే ఉండదు.. ఇప్పుడు ఈ బొమ్మలతో లవ్ సీన్లను ఎలా తెరకెక్కిస్తారో చూడాలని అంటున్నారు.
కొన్ని షో నిర్వాహకులతై ఎందుకు వచ్చిన రిస్క్ అనుకుని అసలకే లవ్ సీన్లను కట్ చేసేస్తున్నారంట..స్టోరీ అలానే ఉంటుంది.. కథలోని సన్నివేశాలు మాత్రం బొమ్మలతోనే మాట్లాడుకుంటాయి… క్లోజప్ సీన్లలో మాత్రమే ఈ పరిస్థితి కనిపించనుంది. కరోనా మహమ్మారి సమయంలో థాయ్ ఫిల్మ్ షూటింగ్ లలో లవ్ సీన్లను పూర్తిగా బ్యాన్ చేసేశారంట.

క్లోజ్ కాంటాక్ట్ ఉండే ప్రతి సన్నివేశాన్ని బ్యాన్ చేసేస్తున్నారు. ఫైటింగ్ సీన్లలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. బాలీవుడ్ లోనూ షూటింగ్ సెట్లలో ముద్దు సీన్లను నిషేధించారు కూడా. సౌత్ కొరియాలో నెట్ ఫ్లిక్స్ డ్రామా ఫిల్మ్ లలో ఎవరికైనా కరోనా  లక్షణాలు ఉంటే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇక ముద్దు సీన్లు లేదా ఇతర సీన్లలో ఒక యాక్టర్.. మరో యాక్టర్ ముఖాన్ని లేదా వారి శరీరాన్ని తాకాలంటే.. కోవిడ్-19 నెగటివ్ అని నిర్ధారణ అయి ఉండాలంట. ముద్దు సీన్లలో నటించాలంటే యాక్టర్లు సైతం భయంతో వణికిపోతున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తికి ఎలాంటి అవకాశం లేకుండా కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్ టెక్నికల్ అంశాలతో రొమాన్స్ వంటి సీన్లను రక్తి కట్టించాల్సిందే. ఇద్దరి యాక్టర్ల మధ్య రొమాంటిక్ సీన్ తీయాలంటే.. ఒక గదిలో ఒంటిరిగా ఉంచి సీన్ తీయాల్సిందే అంటున్నారు.. మరో వైపు నుంచి షూట్ చేసి.. రెండింటిని ఎడిటింగ్ లో మిక్స్ చేస్తారంట.. అచ్చం రొమాన్స్ చేసినట్టే కనిపిస్తుందంట… కరోనా సమయంలో ఇలాంటి సీన్లు తీయాలంటే తప్పనిసరిగా ఈ బొమ్మలు వాడక తప్పదని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు