Bhangra : జానపద నృత్య వ్యాయామాలు! భాంగ్రాతో కొత్త ట్రెండ్

జిమ్‌లో పరిగెత్తడం, దూకడం వంటి వాటి వల్ల త్వరగా అలసిపోతారు. ఇలాంటి నృత్యాల వల్ల శక్తితో పాటు వినోదం సొంతమౌతుంది. భాంగ్రా వ్యాయామాలు చేసేందుకు ఇటీవలి కాలంలో ఎక్కవ ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతుంది.

Bhangra Workouts

Bhangra : రోజువారీ వ్యాయామాలైన పరుగెత్తడం, నడవటం , జిమ్ కెళ్ళి బరువులెత్తటం వంటి వ్యాయామాలు చేసిచేసి విసిగిపోయిన వారు కాస్త వెరైటీగా వ్యాయామాలు చేయటం వల్ల కొత్త ఉత్సాహాన్ని పొందవచ్చు. అందులో సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేయటం వంటివి ఫిట్ నెస్ కు చక్కగా ఉపకరిస్తాయి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం సాంప్రదాయ నృత్యాలు ఫేమస్ గా మారాయి. రోజు వారి వ్యాయామాలకు బదులుగా సంగీతంతో కూడిన మీమీ సాంప్రదాయ నృత్యాలను చేయటం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తుందంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. సంగీతంతో కూడిన డ్యాన్స్ వల్ల సెరోటినిన్, ఎండార్ఫిన్ హార్మోన్లను విడుదలవుతాయి. ఈ హార్మోన్ల ప్రభావంతో ఒత్తిడిని తగ్గి ఆనందాన్ని ప్రేరేపితమౌతుంది. ఇదే విషయాన్ని ముంబైకి చెందిన ఫిట్‌నెస్ నిపుణుడు భావన హర్‌చంద్రాయ్ సైతం స్పష్టం చేస్తున్నారు.

హర్ చంద్రాయ్ మాటల ప్రకారం పంజాబ్ లో భాంగ్రా అనేది చాలా శక్తివంతమైన జానపద నృత్యం, పంజాబ్‌లోని వ్యవసాయ వర్గాల నుండి ఇది ఉద్భవించింది. పండుగల సందర్భల్లో పంజాబ్ పల్లెవాసులు ప్రత్యేకంగా నృత్యవేడుకలను నిర్వహిస్తారు. చిన్నా పెద్ద అంతా కలిసి సరదాగా జానపద పాటలకు నృత్యాలు చేస్తుంటారు. వాస్తవానికి ఇది వారి అచార సంస్కృతుల్లో ఈ నృత్యం భాగమైనప్పటికీ ఈ నృత్యం శరీరానికి వ్యాయామంగా తోడ్పడుతుంది. సరైన పద్దతిలో నిర్ణీత సమయం భాంగ్రా నృత్యం చేస్తే 500 నుండి 800 కేలరీలను కరిగించుకోవచ్చు. ఈ నృత్యాలు ఎంతో సరదాగా అనిపిస్తాయి. ఏమాత్రం బోరుకొట్టదు. భాంగ్రా వ్యాయామం మొత్తం శరీరానికి మేలు చేయడమే కాకుండా, చేతులు, కండపుష్టి, ముంజేతులు, భుజాలు, తొడలు వంటి నిర్దిష్ట కండరాలను బలోపేతం చేయటానికి దోహదపడుతుంది.

ఢిల్లీకి చెందిన భాంగ్రా ట్రైనర్ అంకిత్ రజావత్ చెప్పిన దాని ప్రకారం 40 నుండి 45 నిమిషాల పాటు కొనసాగే ఒక షెషన్ లో శరీరానికి ఎంతో వ్యాయామం అవుతుంది. జిమ్‌లో పరిగెత్తడం, దూకడం వంటి వాటి వల్ల త్వరగా అలసిపోతారు. ఇలాంటి నృత్యాల వల్ల శక్తితో పాటు వినోదం సొంతమౌతుంది. భాంగ్రా వ్యాయామాలు చేసేందుకు ఇటీవలి కాలంలో ఎక్కవ ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతుంది. చాలా మంది దీనిని తమ దినచర్యలు భాగం చేసుకుంటున్నారు. దీని వల్ల బరువు తగ్గటమే కాక శరీర ఆకృతిలోనూ మార్పులు గమనించవచ్చు. ప్రస్తుతం మసాలా భాంగ్రా ఫిట్ నెస్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఢిలీ, పంజాబ్ నగరాల్లో ఫిటినెస్ నిపుణులు ఇందుకోసం ప్రత్యేక ఫిట్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఈ భాంగ్రా నృత్యవ్యాయామాలు చేయిస్తున్నారు.