Insect Problem : మీ ఇంట్లో కోడి ఉందా? అయితే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లే

ఊర్లలో ఎక్కువగా కోళ్ల పెంపకం చూస్తూ ఉంటాం. సిటీల్లో కోడి పెంచడం అంటే కష్టమే అయినా దాని వల్ల ఉపయోగం ఉందంటే.. కాస్త ఆలోచించాలి. కోడి ఉంటే చాలు ఆ సమస్యకు సులువుగా చెక్ పెట్టచ్చు.. దేనికో.. చదవండి మరి.

Insect Problem

Insect Problem : ఇంట్లోకి రకరకాల క్రిమికీటకాలు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. వాటివల్ల అనేక వ్యాధులు ప్రబలుతుంటాయి. అయితే వీటికి చెక్ పెట్టడానికి రకరకాలా రసాయనాలు వాడుతుంటాం. నిజానికి అవి కూడా చాలా ప్రమాదకరం. ఎటువంటి కెమికల్ స్ప్రేలు వాడకుండా సింపుల్‌గా కీటకాలకు చెక్ పెట్టొచ్చు.. ఎలా అంటారా? చదవండి. సింపుల్‌గా ఫాలో అయిపోండి.

Pesticide Residues : పంట ఉత్పత్తుల్లో క్రిమిసంహారక అవశేషాలు తగ్గించటానికి మెళుకువలు !

ప్రతి సీజన్‌లో క్రిమికీటకాలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే వీటి బెడద మరీ ఎక్కువ. వాటిని కాపాడుకోవడానికి ఖరీదైన స్ప్రేలు కొనుగోలు చేస్తుంటాం. వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దాంతో కొందరు బేకింగ్ సోడా, నిమ్మకాయ స్ప్రే వంటి వాటిని వాడి కీటకాలను వదిలించుకోవాలని చూస్తారు. అసలే వీటితో పనిలేకుండా క్రిమి కీటకాలను తరిమికొట్టేందుకు ఒక ఉపాయం ఉంది. అదేంటంటే?

మీ ఇంట్లో కోడి ఉందా? ఇదేం ప్రశ్న అనుకోకండి. సాధారణంగా నాన్ వెజ్ తినేవారు.. ముఖ్యంగా ఊర్లలో ఉండేవారైతే కొంతమంది కోడిని పెంచుకుంటారు. సిటీల్లో కోడి పెంచుకోవడం అంటే కష్టమే.. కానీ మీ ఇంట్లో క్రిమికీటకాలు బెడద నుంచి కాపాడుకోవాలంటే మీ ఇంట్లో కోడి ఉంటే చాలు. క్రిమికీటలకు పరార్. అదెలాగ అంటారా? ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియోను చూస్తే మీకే అర్ధం అయిపోతుంది.

Microbial Insecticides : రైతు స్థాయిలో సూక్ష్మ జీవన క్రిమి సంహారాల తయారీ

@HowThingsWork_ అనే ట్విట్టర్ యూజర్ ‘రాత్రిపూట కీటకాలను తొలగించడానికి రసాయనాలు అవసరం లేదు. అన్నీ సహజ పురుగుమందులు’ అనే శీర్షికతో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తి ఇంటి రూఫ్ అందేలా కర్రపై కోడిని నిలబెట్టాడు. అది చక్కగా క్రిములను ఆరగిస్తోంది. ఈ ఐడియా బానే ఉందంటారా? ఇలా రసాయనాలు వాడకానికి చెక్ పెట్టచ్చు..కాస్త కోడితో పాటు సమయం కేటాయిస్తే చాలు.. దానికి ఆహారం.. మన సమస్యకు పరిష్కారం దొరికినట్లే.. ఇలా ట్రై చేసి చూడండి.