Pesticide Residues : పంట ఉత్పత్తుల్లో క్రిమిసంహారక అవశేషాలు తగ్గించటానికి మెళుకువలు !

మానవ ఆరోగ్యం ఫై మరియు పర్యావరణం పై తక్కువ వ్రభావం చూపే కీటక, శిలీంద్రనాశినులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కాని వీటిని కూడా. రైతులు సిఫార్పు చేసిన వంటలపై నిర్ధేశించిన మోతాదులో వాడకపోగా ఇతర వంటలపై రెట్టించిన మోతాదులో విచక్షణా రహితంగా వాడుతున్నారు.

Pesticide Residues : పంట ఉత్పత్తుల్లో క్రిమిసంహారక అవశేషాలు తగ్గించటానికి మెళుకువలు !

Prevention and control

Pesticide Residues : మన దేశ జనాభాకు ఆహార భద్రతను కల్పించాలంటే వివిధ వంటల ఉత్పత్తులను గణనీయంగా. పెంచడమే కాకుందా ఆహారోత్పత్తులను ఆశించేటటువంటి చీడపీడల నుంచి రక్షించాలి. చీడపీడల కారణంగా సుమారు. 30 శాతం వంట నష్టం అవుతుంది. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి సన్యరక్షణ మందుల పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. మన దేశంలో సుమారు 65 శాతం పురుగు మందుల వాడకం ఉంది. సుమారు 279 సస్యరక్షణ మందులను వినియోగిస్తున్నారు. ఈ సన్యరక్షణ మందులను, సిఫార్సు చేసిన పంటలకు, సిఫార్సు చేసిన మోతాదులో వాడినటైతే ఎటువంటి హాని కలుగదు. వీటిని విచక్షణా రహితంగా వాడినపుడు, దుష్పలితాలకు దారి తీస్తుంది.

READ ALSO : Minister Amit Shah: హైదరాబాద్‌కు అమిత్ షా.. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు.. పీవీ సింధూతో భేటీ

పంట పై పిచికారి చేసిన మందు కేవలం 5-10 శాతం మాత్రమే పంటను ఆశించిన పురుగులను, తెగుళ్ళను నివారించడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన మందు ద్రావణం కొంత ఆవిరిగాను, కొంత భూమి పైపడి మట్టి రేణువులలో కలసి కొంత భూగర్భజలాలలోనికి ఇంకిపోతుంది. ఇది పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. వీటి అవశేషాలు కొన్ని సంవత్సరాల వరకు విచ్చిన్నం కాకుండా ఉంటాయి. మనం రోజు తినే ఆహారంలో వీటి అవశేషాలు. ఉండటం వల్ల ప్రతి రోజు కొంత మొత్తంలో మన శరీరంలో ప్రవేశిస్తాయి. అంతేకాకుండా పర్యావరణంలో అన్ని రకాల ప్రాణులలో కూడా రుగ్మతలను కలుగచేస్తాయి. మనుషులలో ఆరోగ్య నమన్యలు, క్రిమికీటకాలలో రోగనిరోధక శక్తి పెంపొందడం వల్ల పురుగుల మరియు తెగుళ్ళ ఉదృతి పెరిగే అవకాశం కూడా ఉంది.

మానవ ఆరోగ్యం ఫై మరియు పర్యావరణం పై తక్కువ వ్రభావం చూపే కీటక, శిలీంద్రనాశినులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కాని వీటిని కూడా. రైతులు సిఫార్పు చేసిన వంటలపై నిర్ధేశించిన మోతాదులో వాడకపోగా ఇతర వంటలపై రెట్టించిన మోతాదులో విచక్షణా రహితంగా వాడుతున్నారు. ఆహార ఉతృత్తి ఎగుమతుల విషయానికొస్తే దిగుమతి చేసుకొనే దేశం వారు నిర్ధారించిన నాణ్యత ప్రమాణాలతో పాటు ముఖ్యంగా నస్యరక్షణ మందుల అవశేషాలు కూడా పరిమితికి మించి ఉండరాదు.

READ ALSO : Irom Sharmila : చంద్రబాబు అరెస్ట్‌పై ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

మన దేశం నుండి జరుగుతున్న పంట ఉత్పత్తుల ఎగుమతుల్లో సస్యరక్షణమందుల అవశేషాలు పరిమితికి మించి ఉండటం వలన ప్రపంచ మార్కెట్లలో తిరస్మరించబడినవి. ఈ కారణం చేతనే మనదేశం నుండి ఎగుమతి అయిన మిర్చి. తేనె, ద్రాక్ష, వరి మరియు కరివేపాకు ఐరోపా, సౌదీ అరేబియా, దుబాయి. లాంటి దేశాల్లో తిరస్కరించడం జరిగింది.

సస్యరక్షణ మందుల అవశేషాలు పంట ఉత్పత్తులలో ఎక్కువగా గమనించడానికి గల కారణాలు ;

1 అవనరానికి మించి కొద్ది రోజుల వ్యవధిలోనే రకరకాల మందులను కలిపీ కొట్టడం.

2. ఆ పిచికారి చేసిన తరువాత వంటను కోయటానికి కొంతకాలం వేచి వుండే సమయాన్ని సరిగ్గా పాటించకపోవడం.

3. తక్కువ నాణ్యత కల సస్యరక్షణ మందులను వాడటం.

4. పంటను ఆశించింది పురుగా? తెగులా? అని నిర్ధారించక, తోచిన సస్యరక్షణ మందులను పిచికారి చేయడం.

5. సస్యరక్షణ మందులు తయారు చేసే పరిశ్రమల నుండి విడుదలయ్యే కాలుష్యాలను జలాశయాలలో వదలడం.

READ ALSO : Anam Ramanarayana Reddy : జగన్‌కు ఆ భయం పట్టుకుంది, అందుకే చంద్రబాబును అరెస్ట్ చేయించారు- ఆనం రామనారాయణరెడ్డి

6. నిషేదితమైన డిడిటి వంటి మందులను ప్రజా ఆరోగ్యం మరియు పారిశుద్దుం కొరకు ఇంకా వాడటం.

7. పిచికారి చేసిన తరువాత, సస్యరక్షణ మందుల డబ్బాలను సిఫార్సు చేసిన విధంగా నాశనం చేయకపోవడం.

8. కాయకోత అనంతరం మార్కెట్‌కి తీసుకొని వెళ్ళే ముందు నాణ్యత కోసం రసాయనాలను పిచికారి చేయడం లేదా రసాయనాల ద్రావణంలో ముంచడం.

9. పంట ఉత్పత్తులలో రసాయన అవశేషాలు తగ్గించడానికి

పాటించాల్సిన జాగ్రత్తలు

సమగ్ర నన్యరక్షణ వద్ధతులను, జీవరసాయనాలను. ఎక్కువగా వాడి చీడపీడల ఉద్భతిని తొలిదశలోనే అదుపు చేనుకోవాలి. రసాయన క్రిమిసంహారకాలను ఆఖరి అస్త్రంగా మాత్రమే వాడాలి. ఉత్తమ పంట యాజమాన్య పద్ధతులను పాటించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యం ద్వారా పంటకు, సమతుల పోషకాలను అందించి వాటీ రోగనిరోధక శక్తిని పెంపొందించాలి. పంట బెట్టకు గురికాకుండా. అవసరాన్ని బట్టి నీటితడులు అందిందాలి.

సస్యరక్షణ మందుల వాడకంపై రైతులకు, పొలంలో పనిదేసేవారికి అవగాహన పెంచాలి. పిచికారికి, కోతకు మధ్య వేచి వుండే సమయాన్ని అన్ని పంటలకు, అయా పంటలకు సిఫార్సు చేయబడిన నన్యరక్షణ మందులకు నిర్ధారించాలి. పంట ఉత్పత్తుల పైన , లోపల గల రసాయన అవశేషాలను, తీసివేసే కొన్ని పద్ధతులను పాటించాలి.

READ ALSO : Janasena : టీడీపీతో పొత్తుపై జనసేన క్యాడర్‌ రియాక్షనేంటి?

వివిధ వంట మరియు మాంసాహార ఉత్పత్తులలో అవశేషాల పరిమితిపై నిఘావేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందాలి. సరైన అవగాహన లేకుండా అనేక మందులను ఒకేసారి పురుగు,తెగుళ్ళ మందులను కలిపి కొట్టడం వల్ల మరిన్ని సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్‌లో రకరకాల ఫార్ములేషన్ల రూపంలో దొరుకుతున్న సస్యరక్షణ మందులను అవసరాన్ని బట్టి కొనుగోలు చేయాలి.

ఈ జాగ్రత్తలన్ని పాటించినప్పటికీ కొన్ని సార్లు కోతకు ముందు పిచికారి చేసి మార్కెట్‌కు మరుసటి రోజే పంటను పంపే అవకాశం ఉంది. అలాంటప్పుడు కొన్ని సులువైన పద్దతులతో అవశేషాలను కొంతవరకు తాలగించవచ్చు. పారే నీటిలో కూరగాయలను / పండ్షను కడగటం, 2% (శాతం) ఉప్పు ద్రావణంలో పది నిమిషాలు ఉంచి మంచి నీటిలో కడగడం. 2% చింతపండు రసంతో కడగటం, వంటి పద్దతులతో సు మారు 30% వరకు అవశేషాలను తగ్గించవచ్చు.