Minister Amit Shah: హైదరాబాద్‌కు అమిత్ షా.. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు.. పీవీ సింధూతో భేటీ

కేంద్ర మంత్రి అమిత్‌షా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూతోపాటు ఆమె కుటుంబ సభ్యులను కలుస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ నేతలు వారివారి పర్యటనల్లో స్థానికంగా ఉండే పలు రంగాల ప్రముఖులను కలుస్తున్న విషయం తెలిసిందే.

Minister Amit Shah: హైదరాబాద్‌కు అమిత్ షా.. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు.. పీవీ సింధూతో భేటీ

Union Minister Amit Shah

Updated On : September 16, 2023 / 9:37 AM IST

Amit Shah Telangana Tour: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంటారు. నగరంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తారు. త్వరలో తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నేతలతో అమిత్ సమావేశంకానున్నారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతంకోసం ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలు, రాబోయే కాలంలో అనుసరించాల్సి వ్యూహాలపై రాష్ట్ర పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారని సమాచారం.

Chandrababu Naidu Arrest: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు ధర్నా.. నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

షెడ్యూల్ ప్రకారం..

– శనివారం రాత్రి 7.20 గంటలకు అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సీఆర్పీఎస్ సెక్టార్ మెస్ కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.
– 17వ తేదీ ఉదయం 9గంటలకు అమిత్ షా సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ చేరుకుంటారు. ముందుగా సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు.
– 11.10 నిమిషాల వరకు పరేడ్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకల అనంతరం 11.15 గంటలకు అమిత్ షా అక్కడి నుంచి బయలుదేరి సీఆర్పీఎఫ్ సెక్టార్ మెస్ కు చేరుకుంటారు.
– 11.50 నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు అమిత్ షా అక్కడే ఉండనున్నారు.
– 1.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరుతారు.
– 2.25 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
– అమిత్ షా తెలంగాణ బీజేపీ ముఖ్య కార్యకర్తలతో భేటీ అవుతారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.

Amit Shah: ఒక రోజు ముందుగానే హైదరాబాద్ కు అమిత్ షా.. కీలక భేటీ

పీవీ సింధూతో భేటీకానున్న అమిత్ షా..

కేంద్ర మంత్రి అమిత్‌షా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూతోపాటు ఆమె కుటుంబ సభ్యులను కలుస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ నేతలు వారివారి పర్యటనల్లో స్థానికంగా ఉండే పలు రంగాల ప్రముఖులను కలుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమిత్ షా పీవీ సింధుతో భేటీ కనున్నారు. అయితే, రాత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్న తరువాత వీరి భేటీ ఉంటుందా..? లేదంటే రేపు ఉంటుందా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.