Anam Ramanarayana Reddy : జగన్‌కు ఆ భయం పట్టుకుంది, అందుకే చంద్రబాబును అరెస్ట్ చేయించారు- ఆనం రామనారాయణరెడ్డి

జగన్ కళ్లలో ఆనందం కోసం అధికారులు పని చేస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కేసుపై సీబీఐ ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. Anam Ramanarayana Reddy - YS Jagan

Anam Ramanarayana Reddy : జగన్‌కు ఆ భయం పట్టుకుంది, అందుకే చంద్రబాబును అరెస్ట్ చేయించారు- ఆనం రామనారాయణరెడ్డి

Anam Ramanarayana Reddy

Updated On : September 15, 2023 / 10:40 PM IST

Anam Ramanarayana Reddy – YS Jagan : చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. ఎన్నికలను ఎదుర్కొనే సత్తా జగన్ ప్రభుత్వానికి లేదన్నారు. ఎన్నికల భయంతోనే సీఎం జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేయించారని మండిపడ్డారు.

” రాష్ట్రంలో విపరీతమైన ధోరణి రాజకీయం కనిపిస్తోంది. రాజకీయ నాయకులు కన్నా ఎక్కువగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. వారి తీరు చూస్తే వీరికి నియమ నిబంధనలు వర్తించవా అనిపిస్తోంది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు తయారు చేసి 37వ స్థానంలో ప్రముఖ వ్యక్తిని చేర్చడం బాధ కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక చట్టాలను ప్రభుత్వం నడుపుతుంది. తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

Also Read..TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?

ప్రముఖ దేశ రాజకీయ నాయకులు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నారు. అమానుషం అని అన్నారు. జగన్, వారి సలహాదారులకు ఇవి పట్టడం లేదు. జగన్ కళ్లలో ఆనందం కోసం అధికారులు పని చేస్తున్నారు. వైఎస్ వివేకనంద రెడ్డి కేసుపై సీబీఐ ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. సీబీసీఐడీ ఎంతో ఉత్సాహంగా చంద్రబాబు విషయంలో ప్రెస్ మీట్లు పెట్టారు. ఎవరినైనా జైల్లో పెట్టడం వారి లక్ష్యం.

ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. వారిలో భయం ఏర్పడింది. ఎన్నికలను ఎదుర్కొనే సత్తా జగన్ ప్రభుత్వానికి లేదు. జగన్ సభలకు జనం లేరు. పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ప్రజలు తండోప తండాలుగా వస్తున్నారు. లోకేశ్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవన్నీ చూసి జగన్ ఇంతటికి తెగించారు. ప్రజాక్షేత్రంలో బాబుకు న్యాయం జరుగుతుంది. నేను సైతం చంద్రబాబుతో కలిసి పోరాటం చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పడం రాష్ట్ర ప్రజల్లో ఆనందాన్ని నింపింది” అని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

Also Read..TDP- Janasena: జనసేన, టీడీపీ పొత్తు.. ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులేంటి?