Diabetes : షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచే ఆహార పదార్దాలు ఇవే!

షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకునేందుకు కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాటితోపాటు కోడిగుడ్లు, చేపలు కూడా షుగర్‌ను కంట్రోల్‌ చేసేందుకు తోడ్పడతాయని వివరించారు. రక్తంలో ఒకసారి చెక్కర వస్తే దానిని తొలగించడం సాధ్యం కాదని.. కాంట్రల్ లో ఉంచుకోవడమే మన చేతిలో ఉన్న పని అని వైద్యులు చెబుతున్నారు.

Diabetes : డయాబెటీస్‌.. ప్రతి పదిమందిలో ముగ్గురు దీంతో బాధపడుతున్నారు. ఒక్కసారి చక్కర రక్తంలోకి చేరితే దానిని పూర్తిగా నిర్ములించడం అనేది జరిగేపని కాదు. షుగర్ వస్తే దానిని కంట్రోల్ లో పెట్టుకోవడం ఒక్కటే మార్గం.. హెచ్చు తగ్గులు లేకుండా చూసుకుంటూనే ఆరోగ్యానికి మంచిది. లేదంటే శరీరంలోని ఇతర అవయవలమీద కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకునేందుకు మనం నిత్యం తీసుకునే ఆహారాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఆహారం సమయానికి తీసుకుంటూ ఉండాలి.. మనం తీసుకునే ఆహారాల ద్వారానే రక్తంలో చక్కరలు పెరుగుతుంటాయి. రక్తంలో చెక్కరలను పెంచే ఆహారాలను దూరం పెట్టాలి. ఆకూ కూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉండేలా చూసుకోవడం ద్వారా షుగర్ ను కంట్రోల్ పెటుకోవచ్చు.

ఆకుకూరలు, కూరగాయలు

డయాబెటీస్‌తో బాధపడుతున్న వారు ముఖ్యంగా తమ భోజనంలో తప్పనిసరిగా ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. పాలకూర, ఫంగ్రీక్‌, బతువా, బ్రకోలి, పొట్లకాయ, సోరకాయ వంటివి మధ్యాహ్న భోజనంలోకి తీసుకోవాలి. వీటిలో తక్కువ క్యాలరీ, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఆకుపచ్చ కూరగాయల్లో లభించే యాంటీ-ఆక్సిడెంట్ పదార్థం రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తాయి. టైప్‌-2 డయాబెటిస్‌ రోగులకు ఉపయోగపడే విటమిన్‌-సీ కూడా గ్రీన్‌ వెజిటేబుల్స్‌లో లభిస్తుంది.

 

తృణధాన్యాలు, పప్పులు

ప్రజలు తమ అభిరుచిని మార్చుకుంటున్నారు. తృణధాన్యాల వాడకం గత కొన్నేళ్లుగా పెరిగిపోయింది. 50 ఏళ్ళక్రితం మన పూర్వికులు తృణధాన్యాలు తిని పుష్టిగా ఉండేవారు. కాలానుగుణంగా ఆహారంలో మార్పులు చోటుచేసుకోవడంతో కొత్త కొత్త రోగాలు వచ్చిపడుతున్నాయి.. ఇక మధుమేహం సమస్యతో బాధపడుతున్నవారు తినే ధాన్యాలను కూడా మార్చాల్సి ఉంటుంది. భోజనంలోకి ఎక్కువగా పప్పులను చేర్చడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చు. బియ్యంలో షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది… అందుకే రైస్ ని తక్కువగా తీసుకోవడం మంచిది.. దాని స్థానంలో తృణధాన్యాలు తీసుకుంటే మనకు ఎంతగానో మేలు చేస్తాయి.
ఇక పప్పులు శరీరానికి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్, పొటాషియం, ఫైబర్, ఇతర పోషకాలను అందిస్తాయి. ధాన్యపు రొట్టె, ఊక లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, బార్లీ, క్వినోవాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది.

కోడిగుడ్లు

కొంచం వీక్ గా కనిపించినా డాక్టర్లు మనకు సూచించేది కోడిగుడ్డునే.. ప్రతి రోజు ఒక గుడ్డు తినాలని సూచిస్తుంటారు. నిత్యం కోడిగుడ్డును తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. కోడిగుడ్లలో మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు లెక్కలేనంత ప్రోటీన్‌తో పాటు అమైనో ఆమ్లాలు ఉంటాయి. కోడిగుడ్లను తినడం ద్వారా శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. వాపులను తగ్గించడమే కాకుండా చక్కెరలను అదుపులో ఉంచుతుంది. నిత్యం కోడిగుడ్డు తినేవారిలో టైప్‌-2 డయాబెటీస్‌ ప్రమాదం కూడా తగ్గుతుంది.

 

పెరుగు

శరీరంలో వేడిని తగ్గించేందుకు, తక్షణ శక్తిని ఇచ్చేందుకు పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. మధ్యాహ్న భోజనంలోకి పెరుగు తినడం ద్వారా సాధారణ మనుషులతోపాటు షుగర్‌ పేషెంట్లు రెట్టింపు శక్తిని పొందవచ్చు. యోగార్ట్‌ తినడం వల్ల కాల్షియం, ప్రోటీన్‌తోపాటు ఇతర పోషకాలు లభిస్తాయి. యోగార్ట్‌లో పాలిఅన్‌సాచురేటెడ్‌, ఒమేగా-6 వంటి కాంజుగేటెడ్‌ లినోలెయిక్‌ ఆమ్లాలు ఆరోగ్యకరమైన చక్కెరలను పెంచుతాయి.

 

చేపలు

మాంసాహారం తినే అలవాటు ఉన్నవారు చేపలను భోజనంలో ఆహారంతోపాటు తీసుకోవడం మంచి అలవాటు. ముఖ్యంగా సార్డైన్స్‌, హెర్రింగ్‌, సాల్మన్‌ చేపలను తినడం చాలా మంచిది. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతోపాటు డీహెచ్‌ఏ, ఏపీఏలు ఎక్కువగా లభిస్తాయి. చేపలను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకని ఎక్కువ మొత్తంలో చేపలను ఆహారంగా తీసుకోవాలి.

 

ట్రెండింగ్ వార్తలు