Fast Spoiling Foods : బయట ఉంచినప్పుడు త్వరగా చెడిపోయే ఆహారాలు !

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా, బయట ఉంచినప్పుడు సులభంగా పాడయ్యే ఆహారాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ఆహారపదార్థాలు, వెచ్చగా , తేమగా ఉండే పరిస్థితులలో త్వరగా పాడవుతాయి, ఫలితంగా వాటిని తీసుకున్న వారికి అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

Fast Spoiling Foods : ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు ఆహారం వల్ల అనారోగ్యం బారినపడుతున్నారు. ఆహార ప్రమాణాల విషయంలో ప్రతిఒక్కరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆహారప్రమాణాలు సక్రమంగా లేని పక్షంలో వాటిని తీసుకున్న వారు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఆహార ప్రమాణాలపై ప్రతిఒక్కరు దృష్టి పెట్టాలన్న ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

READ ALSO : Diabetes : ఆహారం తీసుకోవటంలో చేసే తప్పులు మధుమేహానికి దారితీస్తాయా? ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారంటే?

ఈ ఏడాది వార్షిక ఆహార భద్రతా దినోత్సవ వేడుకల్లో భాగంగా, UN ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ఒక కొత్త థీమ్‌ను ప్రకటించింది. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2023 ఆహార ప్రమాణాలు ప్రాణాలను కాపాడతాయి అన్న ధీమ్ తో ప్రజల ముందుకు వచ్చింది. ఇది జీవితాలను రక్షించడంలో,ఆహార కాలుష్యాన్ని నివారించడంలో ఆహార ప్రమాణాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అనేది సురక్షితమైన ఆహార నిర్వహణ పద్ధతుల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ఉపకరిస్తుంది. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా, బయట ఉంచినప్పుడు సులభంగా పాడయ్యే ఆహారాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ఆహారపదార్థాలు, వెచ్చగా , తేమగా ఉండే పరిస్థితులలో త్వరగా పాడవుతాయి, ఫలితంగా వాటిని తీసుకున్న వారికి అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

READ ALSO : Vitamin D : రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు !

బయట ఉంచినప్పుడు త్వరగా చెడిపోయే ఆహారాలు ;

1. పాలు: పాలు త్వరగా పాడైపోయే ద్రవం, దీనిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. బయట ఉంచినప్పడు అవి పాడై పోయి విరిగిపోతాయి. అలాంటి వాటిని తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

2. గుడ్లు: గుడ్లు అధిక ఉష్ణోగ్రతల వద్ద త్వరగా పాడవుతాయి, కాబట్టి వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం ఉత్తమం.

3. తాజా పండ్లు: ఆపిల్, బేరి , అరటి వంటి తాజా పండ్లు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు త్వరగా పాడవుతాయి, కాబట్టి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ఉత్తమం.

4. పచ్చి మాంసం: పచ్చి మాంసం బయట ఉంచినప్పుడు వేగంగా బ్యాక్టీరియా దానిపై వచ్చి చేరుతుంది. కాబట్టి దానిని ఫ్రిజ్‌లో ఉంచడం చాలా ముఖ్యం.

READ ALSO : Blood Circulation : శరీరానికి సరైన రక్త ప్రసరణ కోసం ఆహారంలో మార్పులు తప్పదా ?

5. చీజ్: గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు చీజ్ త్వరగా పాడవుతుంది. కాబట్టి దానిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం ఉత్తమం.

6. వండిన అన్నం: వండిన అన్నం బయట పెట్టినప్పుడు త్వరగా పాడైపోతుంది, కాబట్టి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచడం చాలా ముఖ్యం.

7. వండిన కూరగాయలు: వండిన కూరగాయలు బయట ఉంచితే త్వరగా పాడవుతాయి, కాబట్టి వాటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం మంచిది.

8. బంగాళాదుంపలు: బంగాళాదుంపలు బయట ఉంచినప్పుడు చెడిపోయే అవకాశం ఉంటుంది. నేరుగా సూర్యకాంతి పండకుండా చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయడం ముఖ్యం.

READ ALSO : ఈ ఆహారంతో పిల్లల్లో కాల్షియం లోపానికి చెక్

9. నట్స్: నట్స్ బయట ఉంచితే త్వరగా పాడైపోయే అవకాశం ఉంది, కాబట్టి వాటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం మంచిది. నట్స్‌లో కొవ్వు అధికంగా ఉంటుంది, గాలి, వేడికి గురైనప్పుడు ఆక్సీకరణం చెంది చెడిపోయే అవకాశం ఉంది. శీతలీకరణ ఆక్సీకరణ ప్రక్రియను నెమ్మదింపచేస్తుంది. తద్వారా వాటిని ఎక్కువసేపు తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.

10. బ్రెడ్: బ్రెడ్ బయట ఉంచినప్పుడు త్వరగా బూజు పట్టవచ్చు, కాబట్టి దానిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం మంచిది.

ఈ ఆహారాలు చెడిపోకుండా ఉండాలంటే ఫ్రిజ్‌లో ఉంచడం , నేరుగా సూర్యకాంతి తగలకుండా ఉంచడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఆహారాన్ని నిల్వ ఉంచే కంటైనర్లు శుభ్రంగా, పొడిగా ఉండేలా చూసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు